ఆదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది. ఇంతకుముందు ఈ చిత్రం నుంచి విడుదలైన “నైలు నది” అనే సాంగ్ తాజాగా 1 మిలియన్ వ్యూస్ సాధించింది. సిద్ శ్రీరామ్, కళ్యాణి నాయర్ ఆలపించిన ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఇటీవల కాలంలో సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్స్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.…