భాగ్యనగర వాసులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు సిగ్నల్ రహిత మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు జీహెచ్‌ఎంసీ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నగరమంతటా ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది.
ఉప్పల్-ఎల్‌బి నగర్ రహదారిపై చాలా సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ జామ్ సమస్య ఈ జూలై నాటికి తీరనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నాగోల్ వద్ద ఆరు లేన్ల ద్వి దిశాత్మక ఫ్లైఓవర్‌ను నిర్మించడంతో త్వరలో చరిత్రగా మారనుంది. 67.97 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ప్లైఓవర్ ప్రారంభించిన తర్వాత ఉప్పల్ నుండి వచ్చే ట్రాఫిక్, నాగోల్ మీదుగా ఎల్‌బీ నగర్ వైపు వెళ్లే ట్రాఫిక్, ఎల్‌బీ…