Nagole Flyover Inauguration KTR: భాగ్యనగర వాసులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు సిగ్నల్ రహిత మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు జీహెచ్‌ఎంసీ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నగరమంతటా ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద చేపట్టిన నాగోల్ ఫ్లైఓవర్ నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. నాగోల్ ఫ్లైఓవర్‌ను రాష్ట్ర పురపాలక, పరిపాలనా శాఖ పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. నాగోల్ ఫ్లైఓవర్‌కు యుటిలిటీ షిఫ్టింగ్, ల్యాండ్ అక్విజిషన్, ప్రాజెక్ట్‌తో కలిపి మొత్తం రూ.143.58 కోట్లు ఖర్చు చేశారు. ఇది 990 మీటర్ల పొడవుతో 6 ద్వి దిశలతో నిర్మించబడింది. ఈ ఫ్లైఓవర్‌తో ఉప్పల్ నుంచి ఎల్‌బీనగర్ వరకు సిగ్నల్ ఫ్రీ రవాణా సౌకర్యం ఉంటుంది.
Read also: Fire Accident: అంధుల పాఠశాలలో అగ్నిప్రమాదం.. 11 మంది బాలికలు సజీవదహనం
హైదరాబాద్‌లో మెరుగైన రవాణా సదుపాయమే లక్ష్యంగా ఫ్లైఓవర్లను నిర్మిస్తున్న జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ కింద మొత్తం 47 పనులను చేపట్టింది. ఇప్పటి వరకు 31 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరో 16 పనులు పురోగతిలో ఉన్నాయి. పూర్తయిన 31 పనుల్లో 15 ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. నాగోల్ ఫ్లైఓవర్ వరుసగా 16వది. చాలా మంది ప్రజలు నగరంలోకి రావడానికి ఇదే ప్రధాన మార్గం. ఫ్లై ఓవర్ల పరంపర ఇక్కడితో ఆగలేదు. మాదాపూర్, గచ్చిబౌలిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి త్వరలో మరో రెండు ఫ్లై ఓవర్లు రానున్నాయి. ఒకటి కొత్తగూడ ఫ్లైఓవర్ కాగా మరొకటి శిల్పా లేఅవుట్ బ్రిడ్జి. ఈ రెండింటి పనులు పూర్తవుతున్నాయి. వీటిని కూడా డిసెంబర్‌లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నేడు…నాగోల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది.
Fire Accident: అంధుల పాఠశాలలో అగ్నిప్రమాదం.. 11 మంది బాలికలు సజీవదహనం