శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. విడుదలకు ముందే మంచి బజ్ దక్కించుకున్న ఈ సినిమా వసూళ్లలోనూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రూ. 50 కోట్ల మార్క్‌కు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల పర్ఫామెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సక్సెస్ ను సెలెబ్రిట్ చేసుకోవాలనున్న చిత్రబృందం, నేడు సాయంత్రం హైదరాబాద్ లో మ్యాజికల్ సక్సెస్ మీట్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగార్జునతో పాటు దర్శకుడు సుకుమార్ హాజరుకానున్నారు.
ఇక యూఎస్ లోను ‘లవ్ స్టోరీ’ చిత్రం వన్ మిలియన్ మార్క్ ను టచ్ చేయటం విశేషం.. పవన్ సి హెచ్ సంగీతం అందించిన ఈ చిత్రం పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై నారాయణ్ దాస్ కే నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావులు నిర్మించారు.