టాలీవుడ్ లోకి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. వైరల్ ప్రొడ్యూసర్ గా మారిన నిర్మాత నాగవంశీ బావమరిది హీరోగా లాంచ్ కాబోతున్నాడు. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మాత చిన్న బాబు అనేక సినిమాలు చేసుకొచ్చారు. తర్వాత ఆయన సోదరుడి కుమారుడు నాగవంశీ కూడా సినీ నిర్మాతగా మారి సితార ఎంటర్ టైన్మెంట్స్ అనే బ్యానర్ మొదలు పెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు.