అక్కినేని నాగచైతన్య చివరిగా "తండేల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాతో ఆయన సూపర్ హిట్ కొట్టడమే కాకుండా, వంద కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల హీరోగా కూడా మారాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నాగచైతన్యకు వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తీసుకొచ్చింది.
అక్కినేని హీరోలు సూపర్ ఫిట్నెస్ తో ఉంటారు. కింగ్ నాగార్జున, అక్కినేని అఖిల్, యువ సామ్రాట్ నాగ చైతన్యల ఫిజిక్ చూస్తే సాలిడ్ గా ఉంటుంది. ముఖ్యంగా నాగ చైతన్యకి ఫిట్నెస్ పైన కాన్సెన్ట్రేషన్ ఎక్కువ… సినిమాలతో సంబంధం లేకుండా ఫిట్ గా ఉండడం, ప్రతి రోజూ జిమ్ కి వెళ్లడం నాగచైతన్యకి అలవాటైన పని. రోజు చేసే జిమ్ ని సినిమా కోసం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ… యూత్ కి కొత్త ఫిట్నెస్ గోల్స్…