అక్కినేని నాగచైతన్య చివరిగా “తండేల్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాతో ఆయన సూపర్ హిట్ కొట్టడమే కాకుండా, వంద కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల హీరోగా కూడా మారాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నాగచైతన్యకు వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తీసుకొచ్చింది. నటనలో సాయి పల్లవితో పోటీగా నటించాడనే పేరు తెచ్చుకున్నాడు నాగచైతన్య. ఇక ఇప్పుడు ఆయన కార్తీక్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. విరూపాక్ష తర్వాత కార్తీక్ వర్మ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
READ MORE: MLC Botsa Satyanarayana: ఆర్థికంగా ఏపీ.. పాకిస్తాన్ అయిపోతుంది.. బొత్స సంచలన వ్యాఖ్యలు
ఇక ఈ సినిమా కోసం నాగచైతన్య ఏకంగా తన లుక్ మార్చేశాడు. తండేల్ సినిమా కోసం జుట్టు పెంచి రగ్గడ్ లుక్‌లో కనిపించిన ఆయన, ఇప్పుడు చేస్తున్న సినిమా కోసం పూర్తిగా మోడరన్ అవతారంలోకి మారిపోయాడు. ట్రెజర్ హంటర్ పాత్ర పోషిస్తూ ఉండడంతో, ఆ పాత్రకు తగ్గట్టు పూర్తి మేకోవర్ చేసుకున్నాడు. దానికోసమే ఆయన మోడరన్ లుక్‌లోకి మారిపోయినట్లు తెలుస్తోంది. ఈ రోజు మీడియాతో ముచ్చటించాడు నాగచైతన్య. అయితే, ప్రస్తుతానికి కేవలం సినిమా యూనిట్ మాత్రమే ఈ మీడియా ఇంటరాక్షన్ మొత్తాన్ని వీడియో షూట్ చేసింది. త్వరలోనే దాన్ని రిలీజ్ చేయబోతున్నారు. అప్పటివరకు నాగచైతన్య లుక్ ఏమిటనేది కాస్త సస్పెన్స్ అనే చెప్పాలి. నిజానికి ఈ మధ్యనే ఆయన ఈ పాత్ర కోసం బాగా మేకోవర్ అయ్యాడు. అయితే, పది రోజుల నుంచి షూటింగ్‌లో పాల్గొంటూ ఉండడంతో, ఆయన సినిమాలో కనిపించే లుక్ కూడా ఈ రోజు మీడియా ఇంటరాక్షన్‌లో స్పష్టత వచ్చేసింది.