శ్రీకాకుళం జిల్లాలో నేడు జనసేన పీసీఏ చైర్మెన్ నాదెండ్ల మనోహార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు భరోసా ఇచ్చేందుకు జనసేన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగావకాశాలకు ప్రణాళిక చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జాతీయ యూత్ డే సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. యువత కోసం నిజాయితీగా ఈ ప్రభుత్వం కృషి చేయలేదని ఆయన ఆరోపించారు. ఉపాధి అవకాశాలు లేకపోవడం వలసలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. కేవలం ఎన్నికల కోసం కాదని, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తామని, యువత ఆవేదన అర్ధం చేసుకున్నామన్నారు మనోహర్.
Also Read : Bandi sanjay: మహిళ కావడంతోనే ఇంటికి వెళ్లి సీబీఐ విచారణ చేస్తున్నారు
అద్భుతమైన యూత్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే కేసులకు, బెదిరింపులకు తలొగ్గాల్సిన అవసరం లేదన్నారు. కలసిక ట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి మీద అవగా హన పెంచుకుని మరీ ప్రజాక్షేత్రంలో పోరాడుదామన్నారు. నాయకత్వం అంటే సోషల్ మీడియాలో ఒకటీ రెండు పోస్టులు, నాలుగు నినాదాలు కాదని చెప్పారు. పార్టీ విధానా లను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. జనసేనా సిద్ధాంతాలను వినిపించాలని సూచించారు నాదెండ్ల మనోహార్. పార్టీ గెలుపుకోసం శ్రమించే ప్రతిఒక్కరినీ పవన్‌కల్యాణ్ గుర్తిస్తారని నాదెండ్ల మనోహార్ వివరించారు. ఈ క్రమంలోనే యువశక్తి ప్రొగ్రాం పోస్టర్ ను నాదెండ్ల మనోహార్ ఆవిష్కరించారు.