పేరుకు ముందు తొలి చిత్రం పేరు ‘అల్లరి’ని ఏ ముహూర్తాన పెట్టుకున్నాడో కానీ నరేశ్ కు అన్నీ అల్లరి చిల్లరి వినోదాత్మక చిత్రాలే వచ్చాయి. ఇంతవరకూ నరేశ్ నటించిన 57 సినిమాల్లో పై ఏడు సినిమాల్లో కొంత భిన్నమైన పాత్రలను నరేశ్ చేశాడనిపిస్తుంది. ఆ కోవలో వచ్చిన మరో చిత్రం ‘నాంది’. కామెడీ హీరోగా ముద్ర పడిన నరేశ్ లోకి నటుడిని వెలికి తీసిన చిత్రాల సరసన ‘నాంది’ సైతం నిలబడుతుంది. విజయ్ కనకమేడల ను దర్శకుడిగా…