ఆదివారం సాయంత్రం పటాన్‌చెరువులో పర్యటించిన మంత్రి హరీశ్ రావు.. రూ. 8.30 కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. రూ. 3.40 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ బిల్డింగ్‌తో పాటు రూ. 3.85 కోట్లతో ఆధునీకరించిన మైత్రి క్రీడా మైదానాన్ని.. అలాగే రూ. 1.10 కోట్లతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఏడున్నర కోట్లతో పటాన్‌చెరువు స్టేడియం నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా…