ఈ వీకెండ్ డబ్బింగ్ తో కలిపి ఎనిమిది సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అలానే బాలీవుడ్ లో ముగ్గురు తెలుగు దర్శకులు రూపొందించిన సినిమాలు విడుదల అవుతున్నాయి.
KTR: ఇంట్లో పిల్లలకు సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు సంగీతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు దర్శకత్వం వహించిన “సంగీత పాఠశాల” సినిమా ఫంక్షన్‌లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
శ్రియా, శర్మన్ జోషి జంటగా నటించిన 'మ్యూజిక్ స్కూల్' మూవీ ట్రైలర్ ను ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.
మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో శర్మన్ జోషి, శ్రియా శరన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ మూవీ హైదరాబాద్, గోవా సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాలో మొత్తం 11 పాటలున్నాయి. అందులో మూడు పాటలు కేవలం మ్యూజిక్‌తోనే సాగుతాయి. కిరణ్ డియోహన్స్ తన కెమెరా పనితనంతో విజువల్స్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించి సినిమాను నెక్ట్స్…
మాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందుతున్న మ్యూజికల్ మూవీ ‘మ్యూజిక్ స్కూల్’ షూటింగ్ దసరా రోజున లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు, హిందీ భాషల్లో పాపారావు బియ్యాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శర్మన్ జోషి, శ్రియా శరన్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సింగర్ షాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. నవంబర్ 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గోవాలో ప్రారంభమవుతుంది. సినిమాలోని 12 సాంగ్స్ సహా అన్నింటికీ సంబంధించిన రిహార్సల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.…
వైవిధ్యమైన స్వరంతో పాటలు పాడుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ప్రముఖ సింగర్ షాన్. ఇప్పుడు ఆయన పాపారావు బియ్యాల దర్శకుడిగా పరిచయమవుతూ తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోన్న ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం కోసం నటుడిగా మారారు. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇళయరాజా స్టూడియోలో ఓ పాట పాడిన ఈ సింగర్‌ను చూసి, పాత్రకు సరిపోతాడని భావించి తమ సినిమాలో నటించాలని చిత్ర దర్శక నిర్మాతలు కోరారు. శర్మన్ జోషి,…
యామిని ఫిలింస్ నిర్మించనున్న కొత్త చిత్రం మ్యూజిక్ స్కూల్. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చబోతున్నారు. బ్రాడ్ వే కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రే కొరియోగ్రఫీ అందిస్తున్నారు. పాపారావు బియ్యాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శర్మన్ జోషి, శ్రియా శరన్, సుహాసిని ములే, బెంజిమిన్ గిలాని, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, వినయ్ వర్మ, గ్రేసీ గోస్వామి, ఓజూ బారువా ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. ‘జోధా అక్బర్’ వంటి చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన…