కతువాలోని బకర్వాల్ కమ్యూనిటీకి చెందిన 8 ఏళ్ల బాలిక 10 జనవరి 2018న తప్పిపోయింది. వారం తర్వాత ఆ బాలిక అడవిలో శవమై కనిపించింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ బాలిక కేసులో ప్రధాన నిందితుడిపై విచారణ జరిగింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని జిల్లా సెషన్స్ కోర్టులో ఈరోజు(శనివారం) తిరిగి ప్రారంభించారు. గత ఏడాది నవంబర్‌లో, శుభమ్ సంగ్రాను జువైనల్‌గా కాకుండా పెద్దవాడుగా విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కాన్పూర్ లో గుట్కా ఫ్యాక్టరీ యజమాని ఒకరి ప్రాణాలను తీశాడు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చాడు. అతనికి ఇవ్వాల్సిన జీతం వివాదంలో కడతేర్చాడు. అతనికి రావల్సిన జీతం అడిగినందుకు.. యజమానితో గొడవ పడ్డాడు. ఆ తర్వాత హత్య చేశారు. ఈ ఘటనపై గుట్కా ఫ్యాక్టరీ యజమాని, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శిరీష ఎక్కడైతే మృతి చెందిందో.. ఆ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. అనంతరం శిరీష ఇంటికి వెళ్ళి శిరీష తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా శిరీష మృతికి ముందు ఇంట్లో జరిగిన గొడవపై కూడా ఆరా తీశారు.
America : అమెరికాలోని కాలిఫోర్నియాలో దారుణం జరిగింది. రాత్రిపూట కాలింగ్ బెల్ కొట్టి ఓ వ్యక్తిని ఆటపట్టించేందుకు ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళు ప్రయత్నించారు. దీంతో ఆ ముగ్గురు కుర్రాళ్లను హత్య చేశాడు.
యూపీ గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్యపై భారత్‌పై దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ బెదిరించింది. కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ను హత్య చేసినందుకు భారతపై దాడులు చేస్తామని అల్-ఖైదా (AQIS) హెచ్చరించింది.
Vijayawada Crime: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది.. ప్రేమ వ్యవహారంలో ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురైన ఘటన బెజవాడలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన నవీన్ కు ఒంగోలుకు చెందిన బాలికతో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది.. దీంతో సదరు మైనర్ బాలిక.. నవీన్ కోసం ఒంగోలు నుండి విజయవాడలోని నవీన్ ఇంటికి వెళ్లిపోయింది.. ఇక, బాలికను బుజ్జగించి ఇంటికి తీసుకెళ్తామని వచ్చిన కుటుంబ సభ్యులు.. విజయవాడ చిట్టి నగర్…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నేరాలకు అడ్రస్ గా మారుతోంది. ఇటీవల కాలంలో హత్యలు జరుగుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ సోదరులు, ఆయన కుమారుడి ఎన్ కౌంటర్ ఘటన మరువక ముందే మరో దారణం జరిగింది. జలాన్ జిల్లాలో ఈరోజు ఉదయం కళాశాల పరీక్షకు హాజరై తిరిగి వస్తున్న యువతిని మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు.
బెంగళూరులో తన ప్రియుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఓ యువతి.. రాత్రికి హత్యకు గురయింది. ప్రియురాలి హత్య చేసిన ఆరోపణలపై కర్ణాటక పోలీసులు వ్యక్తిని అరెస్టు చేశారు. మృతి చెందిన యువతి 24 ఏళ్ల నవ్యగా గుర్తించారు.
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య అనంతరం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. పాటి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుండి గ్రామంలో పరస్పర వివాదాలు, అనుమానం ఇద్దరి మృతికి కారణమైంది.
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, అతని సహాయకుడు గులామ్‌లను ఝాన్సీలో జరిగిన ఎన్కౌంటర్లో యూపీ పోలీసులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్కౌంటర్ అనంతరం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు తన తండ్రి అతిక్ అహ్మద్‌లను రవాణా చేస్తున్న కాన్వాయ్‌పై అసద్ దాడి చేయడానికి ప్లాన్ చేసినట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి. భద్రత పటిష్టంగా ఉన్నందున అతిక్‌ను విడిచిపెట్టాలని వారు ప్లాన్ చేయలేదు. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది…