America : అమెరికాలోని కాలిఫోర్నియాలో దారుణం జరిగింది. రాత్రిపూట కాలింగ్ బెల్ కొట్టి ఓ వ్యక్తిని ఆటపట్టించేందుకు ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళు ప్రయత్నించారు. దీంతో ఆ ముగ్గురు కుర్రాళ్లను హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడిన వ్యకి భారత సంతతికి చెందిన వాడిగా తేలింది.ఈ ఘటన 2020 జనవరి 19న జరిగింది. కాగా, ఈ ఘటన తర్వాత దీనికి సంబంధించిన కేసులో అనురాగ్ చంద్ర అనే రివర్ సైడ్ కౌంటింగ్ నివాసి మీద నిందితుడిగా కేసు ఫైలయింది. అతడిని న్యాయస్థానం దోషిగా తేల్చింది.
Read Also: Jharkhand Minister : మహిళతో జార్ఖండ్ మంత్రి వీడియో కాల్
అతడిని పట్టుకున్న తర్వాత పోలీసులు విచారించగా కొందరు టీనేజర్లు తమ ఇంటి డోర్ బెల్ ను పదే పదే మోగించి ఆటపట్టించారని అతను తెలిపాడు. ఆ సమయంలో తాను ఫుల్ గా తాగి మద్యం మత్తులో ఉండడంతో.. విసుగు చెందానని తెలిపాడు. పదేపదే బెల్లు మోగిస్తూ ఆటపట్టించడంతో తన కుటుంబ సభ్యుల భద్రత గురించి కంగారు పడినట్లు అనురాగ్ చంద్ర విచారణలో తెలిపాడు.
Read Also: TS Eamcet: ఎంసెట్ హాల్ టిక్కెట్లు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా
దీంతోపాటు..ఆ వ్యక్తిని ముగ్గురు కుర్రాళ్లు డోర్ బెల్ మోగించిన తర్వాత వీపు మీద కొట్టి.. కారులో పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో తీవ్ర కోపానికి లోనైన తాను అలా ఎందుకు చేశారో అడిగేందుకు వారి వెనక కారులో ఫాలో అయ్యానని చెప్పాడు. ఈ క్రమంలో అనుకోకుండా తన కారు వారి కారును ఢీ కొట్టిందన్నాడు. వెంటనే వారి కారు చెట్టుకు గుద్దుకుని ముగ్గురు కుర్రాళ్లు మరణించినట్లు తెలిపాడు. ఈ కేసులో ముగ్గురు టీనేజీ యువకుల మరణానికి కారణమైన అనురాగ్ చంద్రకు పెరోల్ కు అవకాశం లేకుండా యావజీవ శిక్ష పడొచ్చని స్థానిక మీడియా పేర్కొంది.