మునుగోడులో కేఏపాల్ హల్‌చల్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరిశీలిస్తూ ముందుకు సాగారు. చౌటుప్పల్ పోలింగ్ కేంద్రాన్ని స్వతంత్ర అభ్యర్థి కే.ఏ.పాల్ సందర్శించారు. పరుగులు పెడుతూ కనిపించారు.
మునుగోడు నియోజక వర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటును వినియోగించుకునేందుకు ఓటింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. మునుగోడులో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదైంది.
బుద్ధ భవన్ లో కోదండరాం మౌన దీక్ష చేపట్టారు. తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మునుగోడులో జరగుతున్న ప్రభుత్వ అక్రమాలు, ఎన్నికల నియమాల ఉల్లంఘన పై తెలంగాణ జన సమితి పార్టీ అధినేత, ప్రోఫెసర్ కోదండరాం మౌన దీక్ష చేపట్టారు.
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు పలుమార్లు తనిఖీ నిర్వహించారు.
మునుగోడు ఉపఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు కమలదళంలో ఉన్న మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈనెల ఆయన బుధవారం 26న బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారు. అయితే అదేరోజు టీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు.
తనపై సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్లపై పరువు నష్టం దావా వేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హెచ్చారించారు. ఇవాళ మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ హైదరాబాద్‌కి వచ్చిందని పేర్కొన్నారు.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో బీజేపీ తరుపున ప్రచారానికి వెళ్లిన బూర నర్సయ్య గౌడ్ ను టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎట్టకేలకు నేడు ఆస్ట్రేలియాకు బయలు దేరనున్నారు. మళ్లీ తిరిగి నవంబర్ 7న హైదరాబాద్ రానున్నారు. అయితే మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు షురూ కావడంతో రాజకీయం మరింతగా వేడెక్కింది.