Kodandaram Deeksha: బుద్ధ భవన్ లో తెలంగాణ జన సమితి పార్టీ అధినేత, ప్రోఫెసర్ కోదండరాం మౌన దీక్ష చేపట్టారు. తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మునుగోడులో జరగుతున్న ప్రభుత్వ అక్రమాలు, ఎన్నికల నియమాల ఉల్లంఘన పై కోదండరాం మౌన దీక్ష చేపట్టారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా విచ్చల విడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు కోదండరాం మండిపడ్డారు. ఎన్నికల నిబంధనలు పూర్తిగా గాలికొదిలేశారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Kodandaram Deeksha: ఎన్నికల నిబంధనలు గాలికొదిలేశారు.. బుద్ధ భవన్ లో కోదండరాం మౌన దీక్ష
మునుగోడు ఎన్నికలే ప్రజంట్ హాట్ టాపిక్.. ఎన్నికల ప్రచారంలో పార్టీనేతలంతా ఫుల్ బిజీ అయిపోయారు. మునుగోడులో పాగా వేసేందుకు అన్ని పార్టీల నేతలు బాహాబాహీ ప్రచారాలతో దూసుకుపోతున్నారు. నువ్వు ఒక్కటి ఇస్తే నేను రెండిస్తా అంటూ ప్రజలను ఆకట్టుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. డబ్బులు, మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. నోట్ల కట్టలతో ఓట్లు రాల్చుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. కొందరైతే మునుగోడులో ఏకంగా తిష్టవేసి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితులపై ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కుతున్నారంటూ బుద్ధ భవన్ వద్ద మౌన దీక్ష చేపట్టారు. మరి దీనిపై ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
అయితే రోజులు దగ్గరపడుతున్న కొద్ది మునుగోడులో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు. ప్రజాప్రతినిధుల వాహనాల్లోనూ సోదాలు కొనసాగుతోన్నాయి. కానీ.. వాహన తనిఖీలు భారీగా డబ్బుల కట్టలు పట్టుపడుతుండటంతో.. అధికారులు తనిఖీలు వేగం పెంచారు. ప్రతి వాహనాన్ని సోదాలు నిర్వహిస్తున్నారు. అయినా లక్షల్లో డబ్బులు మునుగోడు ప్రచారానికి చేరడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
Jagananna Gorumudda : జగనన్న గోరుముద్ద పథకంలో మార్పులు.. ఇక గుడ్లపై రంగులు