విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు, ఎంపికి ఆహ్వానం పంపకపోవడంపై టీడీపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం పెద్ద ఎత్తున కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా తూర్పు నియోజక వర్గంలో 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి.. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ…
Demanding Bribe : లంచం డిమాండ్ చేసిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఈస్ట్ షాలిమార్ బాగ్‌లో ఓ ఇంటి నిర్మాణానికి బదులుగా లంచం డిమాండ్ చేసినందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) అధికారిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
చెత్త బండిలో యూపీ సీఎం యోగి, ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలను ఓమున్సిపల్ కార్మికుడు తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మధునగర్ నిగమ్ లో చోటుచేసుకుంది. ఒక కాంట్రాక్టు మున్సిపల్ కార్మికుడు తన చెత్త బండిలో ప్రధానిమంత్రి మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు ఇతర ప్రముఖుల ఫోటోలను తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌కి చెందిన కొందరు వ్యక్తలు సదరు వ్యక్తిని ఆపి మరీ ప్రశ్నించడం…
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఆ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అధికారులు దీన్ని బాగా వంటబట్టించుకున్నారు. ఏసీబీ ఎంట్రీ ఇవ్వడంతో ఎవరికివారు జాగ్రత్త పడుతున్నారట. తప్పించుకునే మార్గాల అన్వేషనలో క్షణం తీరిక లేకుండా ఉన్నట్టు టాక్. వారెవరో ఇప్పుడు చూద్దాం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లోని పెద్ద పనోళ్లపై చర్చ! గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. గత దశాబ్దకాలంగా అక్రమ కట్టడాలకు అడ్డదిడ్డంగా అనుమతి ఇచ్చేశారు అధికారులు. ఇప్పుడా అక్రమాలను తవ్వి తీసే పనిలో పడింది ప్రభుత్వం. దాంతో ఆ అవినీతితో…
పరిపాలనలో ఆరితేరిన అధికారులు ఉంటే పాలకులకు.. పైవాళ్లకు వర్క్ ఈజీ. అవినీతిలో ఆరితేరిన ఘనులు ఉంటే ప్రజాప్రతినిధులు.. కమిషనర్‌లకు తిప్పలే తిప్పలు. కొన్నిసార్లు గొడవలకు దారితీస్తుంది. ఆ కార్పొరేషన్‌లో అదే జరుగుతోందట. ఏకంగా మేయర్, కమిషనర్ మధ్యే చిచ్చు పెట్టేలా వ్యవహారాలు నడిపిస్తున్నారట. వారెవరో.. ఏం చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. పాలకుల మధ్య కీచులాటలకు అవినీతి అధికారుల ఎత్తుగడ! గుంటూరు కార్పొరేషన్‌లో కొత్త పోకడలకు తెరతీస్తున్నారు కొందరు అవినీతి అధికారులు. విభజించి పాలించాలని అనుకున్నారో ఏమో…
అవన్నీ హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలు.. మున్సిపల్ కార్పొరేషన్. ప్రజాప్రతినిధులు అక్కడ పగ్గాలు చేపట్టిన ఏడాదికే గిల్లికజ్జాలు. వ్యూహం లోపిస్తుందో.. లేక ఒకరిపై ఒకరు పైచెయ్యి సాధించాలనే పట్టుదలో కానీ నిత్యం గొడవలే. శ్రుతి మించి రోడ్డుకెక్కుతున్నారు. మీర్‌పేట్‌లో మేయర్ భర్తదే పెత్తనం.. సెటిల్మెంట్లు! రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏడాదిగా చర్చల్లో ఉంటోంది. ఇప్పుడు మేయర్ దీప భర్త దీప్లాల్ తీరుతో ఇంకోసారి అక్కడి యవ్వారాలు హాట్ టాపిక్‌గా మారాయి. మీర్‌పేట్‌లో దీప…
ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 50 డివిజన్లలో 46 చోట్ల వైసీపీ విజయం సాధించిగా, మూడు చోట్ల టీడీపీ విజయం సొంతం చేసుకుంది. అత్యధిక డివిజన్లు సొంతం చేసుకుంటామని వైసీపీ నేతలు ముందునుంచే చెప్తూ వస్తున్నారు. చెప్పిన విధంగానే వైసీపీ 46 చోట్ల విజయం సాధించడం విశేషం. గెలుపొందిన 46 డివిజన్లలో మూడు ఏకగ్రీవాలు ఉన్నాయి. ఇకపోతే, ఏలూరులో వీలైనన్ని స్థానాలు గెలుపొంది పట్టును నిరూపించుకోవాలని చూసిన టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం మూడు…