Demanding Bribe : లంచం డిమాండ్ చేసిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఈస్ట్ షాలిమార్ బాగ్‌లో ఓ ఇంటి నిర్మాణానికి బదులుగా లంచం డిమాండ్ చేసినందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) అధికారిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) హెడ్ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (జేసీపీ) మధుర్ వర్మ తెలిపిన వివరాలు, తూర్పు షాలిమార్ బాగ్‌లో నివాసం ఉంటున్న సౌరభ్ జైన్ అనే వ్యక్తి ఇంటిని నిర్మించాలనుకున్నాడు. ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్మాణానికి అనుమతి కోసం మున్సిపల్ అధికారి నారాయణ్ ను ఆశ్రయించాడు. దీంతో అతడు రూ. లక్ష డిమాండ్ చేశాడు. లంచం ఇచ్చేందుకు ఇష్ట పడని సౌరభ్ అన్నయ్య రాజీవ్ మంగళవారం అవినీతి నిరోధక శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. తగిన బేరసారాల తర్వాత రూ.10వేలకు నారాయణ ఒప్పుకున్నట్లు రాజీవ్ చెప్పినట్లు జేసీపీ తెలిపారు.
Read Also: Election Results: నేడు 3రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఏ పార్టీ జెండా ఎగిరేనో..?
ఎలాగైన అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని పోలీసులు రైడింగ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారుడికి ఫినాఫ్తలీన్ ఫౌడర్ చల్లిన రూ.పదివేల నోట్లను ఇచ్చారు. ఆ తర్వాత ఫిర్యాదుదారు నారాయణ్‌ను సంప్రదించి మీటింగ్ పాయింట్‌ను ఫిక్స్ చేశారు. ఫిర్యాదుదారుడితో పాటు రైడింగ్ బృందం మీటింగ్ పాయింట్‌కు వెళ్లింది. సాయంత్రం 4:30 గంటలకు, రైడింగ్ బృందం ఫిర్యాదుదారుతో కలిసి ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లోని మీటింగ్ పాయింట్‌కి చేరుకున్నారు. నారాయణ్ అప్పటికే అక్కడ ఉన్నాడు.. ఫిర్యాదుదారుడి కోసం కారులో వేసినట్లు పోలీసులు తెలిపారు. కొంత చిట్-చాట్ తర్వాత, నారాయణ్ ఫిర్యాదుదారు నుండి లంచం డబ్బు డిమాండ్ చేశాడు. దీనిపై ఫినాల్‌ఫ్తాలిన్ పౌడర్ కలిపిన రూ.10,000ను ఫిర్యాదుదారు అందజేశారు. ఆ తర్వాత రైడింగ్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసుల పార్టీని చూసి నారాయణ్ పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని రైడింగ్ టీం అతడిని ముట్టడించింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి రూ.10వేలు లంచం స్వాధీనం చేసుకున్నారు. అతనిపై సెక్షన్ 7 పీఓసీ యాక్ట్, పీఎస్ ఏసీబీ కింద కేసు నమోదు చేశారు. అనే కోణంలో తదుపరి విచారణ జరుపుతున్నారు.