ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లుగా ఇతర శాఖల ఉద్యోగుల నియామకంపై విధివిధానాలు జారీ చేసింది... ఇతర శాఖల నుంచి ఎక్కువ మంది మున్సిపల్ శాఖకు వచ్చేందుకు ఆసక్తి చూపుతుండటంతో పలు నిబంధనలతో ఉత్తర్వులు జారీ చేసింది..
కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది.. మున్సిపల్ కమిషనర్ వర్సెస్ మేయర్‌గా మారింది పరిస్థితి.. కడప మున్సిపల్ కార్పొరేషన్ లో కమిషనర్‌తో పాటు ఎనిమిది మంది అధికారులకు మేయర్ సురేష్ బాబు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, ఎస్ఈ, ఎంహెచ్‌వో, మేనేజర్, కౌన్సిల్ సెక్రటరీ, ఇద్దరు ఆర్వోలకు నోటీసులు జారీ చేశారు.
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు ఏసీబీ వలలో పడ్డాడు. బాధితుడి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. అనంతరం.. మంగళవారం పక్కా సమాచారంతో.. వనస్థలిపురం కమ్మగూడలోని ఆదిశేషు ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Mandi Masjid Controversy: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండిలోని జైలు రోడ్డు మసీదు అక్రమ నిర్మాణం కేసులో ముస్లిం పక్షం స్టే ఆర్డర్ తెచ్చింది. సెప్టెంబరు 13 నాటి నిర్ణయంపై తదుపరి విచారణ జరిగే వరకు కార్పొరేషన్ ఎలాంటి చర్యలు తీసుకోరాదని కోర్టు ఆదేశించింది.
జగిత్యాల జిల్లాలో అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మధ్య వివాదం ముదిరింది. గతవారం ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మద్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే.. దసరా పండుగా (శమీపూజ) పై అధికారుల వివాదం ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. అనాదిగా 100 సంవత్సరాల నుండి వస్తున్న ఆచారానికి అధికారుల ఇగో వల్ల మంట కలుస్తుందని జగిత్యాల ప్రజల నిరసన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక మోతె గ్రామపంచాయతీ ట్రాక్టర్ ని అద్దెకు తీసుకొచ్చారు రెవెన్యూ…
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్లో చెత్త పంచాయితీ మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తాకింది. విధి నిర్వహణలో మున్సిపాలిటీ కమిషనర్ పద్మజారాణి ఆదేశాలను, మున్సిపాలిటీ చట్టాలను బేఖాతర్ చేసిన బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ సామాల బుచ్చిరెడ్డికి , మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్ షోకాజ్ నోటీస్లు జారీ చేసింది. మేడ్చల్ లోని బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య సమస్య అద్వానంగా తయారైంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట రోడ్లపై చెత్తను ఇష్టానుసారంగా పడేసి పోతున్నారు. దీంతో..…