జగిత్యాల జిల్లాలో అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మధ్య వివాదం ముదిరింది. గతవారం ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మద్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే.. దసరా పండుగా (శమీపూజ) పై అధికారుల వివాదం ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. అనాదిగా 100 సంవత్సరాల నుండి వస్తున్న ఆచారానికి అధికారుల ఇగో వల్ల మంట కలుస్తుందని జగిత్యాల ప్రజల నిరసన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక మోతె గ్రామపంచాయతీ ట్రాక్టర్ ని అద్దెకు తీసుకొచ్చారు రెవెన్యూ అధికారులు. శతాబ్దంగా వస్తున్న ఆచారాన్ని తుంగలో తొక్కారు మున్సిపల్ కమిషనర్. అధికారుల సమన్వయ లోపంతో జగిత్యాల ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 40 ఏళ్ల దసరా జమ్మి ఉత్సవాలపై బల్దియా ఆచారానికి కమిషనర్ తూట్లు పొడిచారు. వందేళ్ల నుంచి జగిత్యాల జిల్లా కేంద్రంలోని జమ్మిగద్దె వద్ద దసరా జమ్మి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ తర్వాత జగిత్యాలలోనే జమ్మిగద్దె ఏర్పాటు చేశారు.
Harihara Veeramallu: హరిహర వీరమల్లు కోసం పాట పాడిన పవన్
గత 40 ఏళ్లుగా జమ్మిగద్దెకు జగిత్యాల బల్దియా ఆధ్వర్యంలో జమ్మిచెట్టు తీసుకురావడం, రెవెన్యూ అధికారులు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఇటీవల జరిగిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్, జగిత్యాల బల్దియా కమిషనర్ సమ్మయ్య నడమ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో.. ప్రజావాణిలో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని జమ్మిగద్దెకు జమ్మిచెట్టు తీసుకువచ్చే ట్రాక్టర్ ను పంపవద్దని అనధికార కమిషనర్ అదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ పంపిస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తానంటూ కింది స్థాయి సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య బెదిరింపులు చేసినట్టు సమాచారం. చేసేదేం లేక సమీప గ్రామమైన మోతే గ్రామం పరిధిలో ట్రాక్టర్ అద్దెకు తీసుకొచ్చారు రెవెన్యూ అధికారులు.. పర్సనల్ ఈగోలకు పోయి జగిత్యాల ప్రజల ఆచార వ్యవహారాలతో ఆడుకోవద్దని మున్సిపల్ కమిషనర్ తీరుపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mallikarjun Kharge: బీజేపీ టెర్రరిస్టుల పార్టీ.. కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..