Wagh Nakh: మరాఠా సామ్రాజ్యనేత ఛత్రపతి శివాజీ మహరాజ్ ఉపయోగించిన ఆయుధం ‘‘వాఘ్ నఖ్’’ లేదా పులి పంజాగా పిలిచే ఆయుధం లండర్ మ్యూజియం నుంచి ముంబైకి చేరుకున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటివార్ తెలిపారు.
క్రికెటర్ కేఎల్.రాహుల్, సతీమణి అతియా శెట్టి ముంబైలో నూతన గృహాన్ని కొనుగోలు చేశారు. బాంద్రాలోని పాలిహిల్ ప్రాంతంలోని రూ.20 కోట్లతో ఇల్లు కొనుగోలు చేశారు.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తవ్వేకొద్దీ అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక ఆరోపణలు రావడంతో ఆమె శిక్షణ కార్యక్రమాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయినా కూడా ఆమెకు సంబంధించిన వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
ఆర్థిక రాజధాని ముంబైలో మరో అద్భుతమైన ప్రాజెక్ట్ ఆవిష్కృతం కాబోతుంది. నగరానికే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. మొట్టమొదటిసారిగా భూగర్భంలోంచి మెట్రో రైలు వెళ్లేలా ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పూనుకుంది. ఈ
ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్కు బిగ్ షాక్ తగిలింది. ఆమె శిక్షణ నిలిపివేస్తూ తాజాగా ఆదేశాలు వెళ్లాయి. అకాడమీకి రీకాల్ చేశారు. దీంతో పూజాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
జ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేదార్నాథ్లో భారీ స్థాయిలో బంగారం కుంభకోణం జరిగిందని చెప్పారు. 228 కిలోల బంగారం కనిపించడం లేదని అన్నారు. దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని.. దీనికి బాధ్యులైన వారి వివరాలు బయటకు తీసుకురావాలన్నారు.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన వివాహ వేడుకలు కన్నుల పండుగగా నిలిచిపోయింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిరథ మహరథులతో ముంబై నగరం సందడి సందడిగా మారిపోయింది.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరింత ముదురుతోంది. ఆమె వ్యవహారం ఓ వైపు రచ్చ రచ్చ చేస్తుంటే.. ఇంకోవైపు ఆమె తల్లిదండ్రుల పాత్ర కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2023 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ పూజా.. డ్యూటీలో చేరకముందే.. గొంతెమ్మ కోర్కెలు కోరింది. అధికార దుర్వినియోగానికి పాల్పడింది.
ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో భేటీ అయ్యారు. షిండే ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసమైన వర్షకు విచ్చేసిన చంద్రబాబుకు ఏక్నాథ్ షిండే ఘనంగా స్వాగతం పలికారు.
అనంత్ అంబానీ-రాధిక వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ పెళ్లికి తారాలోకమంతా దిగొచ్చింది. వ్యాపార వేత్తలు, రాజకీయ ప్రముఖులు, విదేశీ వీఐపీలతో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ధగధగ మెరిసిపోయింది.