ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025)లో ఈరోజు ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెన్నైని ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025లో 33వ మ్యాచ్ గురువారం ముంబై ఇండియన్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
MI vs DC: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు (ఏప్రిల్ 13) న ఢిల్లీలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో… ప్రారంభంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 12 బంతుల్లో 18 పరుగులు చేసి త్వరగా వెనుదిరిగినప్పటికీ, ర్యాన్ రికెల్టన్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 2…
MI vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జేట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ కేపిటల్స్ (DC) మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఇక మ్యాచ్ టాస్‌లో విజయం సాధించిన ఢిల్లీ కేపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సందర్బంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో టాస్ గెలిచి మేమే నిర్ణయం తీసుకున్నామని, ఈసారి ప్రత్యర్థి నిర్ణయం తీసుకోవడం వల్ల భిన్న అనుభూతి…
ఐపీఎల్ 18వ సీజన్‌లో ఈరోజు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్‌లో ముంబై నాలుగు మ్యాచులు ఆడి.. కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండాలంటే.. ఇక నుంచి అయినా విజయాలు సాధించాలి. మరోవైపు బెంగళూరు మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలిచి టాప్-3లో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ఏకంగా అగ్రస్థానానికి చేరుకుంటుంది. ‘ఈసాలా…
టీమిండియా పేస్ సెన్సేషన్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. గత జనవరిలో ఆ్రస్టేలియా పర్యటనలో గాయపడ్డ బుమ్రా.. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చికిత్స తీసుకున్నాడు. తాజాగా బీసీసీఐ మెడికల్ టీమ్ ఫిట్నెస్ టెస్టులో పాసై.. ఆదివారం ముంబై జట్టుతో కలిశాడు. ఈరోజు ముంబైలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగనున్నాడు. బుమ్రా నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియోలను ముంబై ప్రాంచైజీ షేర్ చేసింది. ఈ…
ఐపీఎల్ 2025లో విజయాలు లేక సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్. పేస్ సెన్సేషన్ జస్ప్రీత్ బుమ్రా ముంబై జట్టులో చేరాడు. ఈ విషయాన్ని ముంబై ప్రాంచైజీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. ‘రెడీ టు రోర్’ అని క్యాప్షన్ ఇచ్చి.. ఓ వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలో బుమ్రా సతీమణి సంజనా గణేశన్, కుమారుడు అంగద్‌ను చూపించారు. అంగద్‌కు తండ్రి బుమ్రా ఐపీఎల్ జర్నీ గురించి సంజనా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్…
LSG vs MI: ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో భాగంగా ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఒక అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ హోరాహోరీ పోటీలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 12 పరుగుల స్వల్ప తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. లక్నోలోని సొంత మైదానంలో జరిగిన ఈ ఉత్తేజకరమైన పోరులో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్, 20 ఓవర్లలో…
LSG vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా లక్నో ఎకానా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లి కోల్పోయి 203 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే, లక్నో బ్యాట్స్మెన్లు మెరుగైన ప్రదర్శన చేసి తమ…
LSG vs MI: లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య నేడు (శుక్రవారం) భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్రస్తుత సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో ఓడిపోయింది. లక్నో జట్టుతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. దీని తర్వాత ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. కానీ, మూడో మ్యాచ్‌లో…