IPL 2023 Retention: ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించి రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. నవంబర్ 15వ తేదీ వరకు మాత్రమే బీసీసీఐ గడువు ఇవ్వడంతో అన్ని ఫ్రాంచైజీలు రిటైనింగ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. డిసెంబర్ 23న కేరళలోని కొచ్చి వేదికగా మినీ వేలం జరగనుంది. కొందరు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలివేశాయి. దీంతో ఆయా ఫ్రాంచైజీల పర్సు పెరిగింది. అత్యధికంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 16 మంది ఆటగాళ్లను, ముంబై ఇండియన్స్ 13 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేయగా..…
IPL 2023: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్ వచ్చే ఏడాది జరిగే మెగా లీగ్ కోసం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఏకంగా 13 మంది ఆటగాళ్లను ముంబై యాజమాన్యం వదులుకుంది. దీంతో ముంబై పర్స్‌లో రూ.20.5 కోట్లు మిగిలాయి. ఈ డబ్బుతో వచ్చే నెల 20న జరిగే మినీ వేలంలో సత్తా కలిగిన ఆటగాళ్ల కొనుగోలు చేసి వచ్చే సీజన్‌లో మరోసారి టైటిల్…
IPL 2023: వచ్చే ఏడాది ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందే అభిమానులకు షాక్ తగిలింది. ఐపీఎల్‌కు వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌లో 2010 నుంచి పొలార్డ్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ముంబై టీమ్‌లో మార్పులు అవసరమని.. తాను ఇప్పుడు ఆ జట్టుకు ఆడలేకపోతున్నానని పొలార్డ్ పోస్ట్ చేశాడు. అయితే తాను ఎప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టుకు అండగానే ఉంటానని పొలార్డ్ తెలియజేశాడు. వచ్చే సీజన్ నుంచి ముంబై…
Gujarat Titans: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే సీజన్ ఐపీఎల్ సందర్భంగా గుజరాత్ జట్టు నుంచి శుభ్‌మన్ గిల్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. శుభ్‌మన్ గిల్ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించింది. తమ జట్టుతో కొనసాగిన అతని ప్రయాణం అద్భుతమని ప్రశంసించింది. ‘శుభ్‌మన్ నీ ప్రయాణం గుర్తించుకోదగినది. నీ భవిష్యత్ మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాం’అని ట్వీట్ చేసింది. ఈ…
Mumbai Indians: ఈ ఏడాది ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన చేసిన ముంబై ఇండియన్స్ జట్టుకు వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కొత్త కోచ్ రానున్నాడు. ఈ మేరకు ప్రధాన కోచ్‌గా మార్క్ బౌచర్‌ను ముంబై ఇండియన్స్ నియమించింది. ఐపీఎల్ 2023 నుంచి తమ జట్టు ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం మార్క్ బౌచర్‌ను నియమించినట్లు ముంబై ఇండియన్స్ ప్రకటించింది. వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా బౌచర్ కీలక ఆటగాడిగా పేరు పొందాడు. క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత దక్షిణాఫ్రికాలో…
IPL 2022 సీజన్ లో మునుపెన్నడూ లేని విధంగా ముంబై జట్టు అత్యంత ఘోరంగా విఫలమైంది. వరుసగా ఎనిమిది ఓటములను మూటగట్టుకొని పాయింట్ల పట్టికలో లాస్ట్ నుండి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అసలు ఇది ముంబై జట్టేనా, ఐదు సార్లు టైటిల్ గెలిచినా జట్టేనా అన్నట్లు ఆడింది. రోహిత్ శర్మ, పోలార్డ్ ,ఇషాంత్ కిషన్ ,బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కనీసం వల్ల స్థాయికి తగ్గట్టు కూడా ఆడకపోవడంతో IPL చరిత్రలోనే ముంబై జట్టు…
ఐపీఎల్ పుణ్యమా అని, ఎందరో యువ ఆటగాళ్ళ ప్రతిభ బయటపడింది. ఒక్క అవకాశం అంటూ కలలు కన్న ఎందరో ప్లేయర్స్‌కి.. ఈ టీ20 లీగ్ ఒక అద్భుత వరంలా మారింది. ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్ సీజన్స్‌లో చాలామంది యంగ్‌స్టర్స్ తమ సత్తా చాటి.. అందరి దృష్టిని ఆకర్షించారు. టీమిండియాలో చోటు దక్కిందా? లేదా? అనే విషయాన్ని పక్కనపెడితే.. క్రీడాభిమానుల గుండుల్లో మాత్రం తమదైన ముద్ర వేయగలిగారు. ఇప్పుడు లేటెస్ట్గా అలాంటి ఆటగాళ్ళ జాబితాలోకి తెలుగుతేజం నంబూరి తిలక్…
అది 2018.. ఆ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌లో బెర్తు కన్ఫమ్ చేసుకోవాలంటే, ఆ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి.. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆ ఆశల్ని నీరుగార్చింది.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ, ముంబైను ప్లేఆఫ్స్‌కు వెళ్ళకుండా అడ్డుకుంది. ఇప్పుడు నాలుగేళ్ళ తర్వాత ఆ ప్రతీకారాన్ని ముంబై తీర్చుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ను ముంబై సొంతం చేసుకొని, ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశల్ని గల్లంతు చేసింది. ఈసారి ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో…
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (5), ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ (0) త్వరత్వరగా ఔట్ కావడంతో 22 పరుగులకే రెండు వికెట్లు…
ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్స్ చేరుకున్నాయి. నాలుగో స్థానం కోసం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ నెలకొంది. ఈరోజు రాత్రికి జరిగే మ్యాచ్ నాలుగో బెర్తును ఖరారు చేయనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కథ ముగుస్తుంది. అందుకే ముంబై ఇండియన్స్ జట్టు…