ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో, ముంబైపై 3 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 9 పరుగులకే పెవిలియన్ చేరగా.. అతనితో పాటు క్రీజులో దిగిన ప్రియమ్ గార్గ్ మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లోనే…
కీలకమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. సెమస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో మెరుపులు మెరిపించారు. ముంబై ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు సన్ రైజర్స్ బ్యాటర్లు. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు సాధించారు. ఫలితంగా ముంబై ముందు 194 పరుగుల భారీ టార్గెట్ పెట్టారు. సన్ రైజర్స్ బ్యాటర్లలో ప్రియంగార్గ్, త్రిపాఠి, నికోలస్…
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ప్లే ఆఫ్స్ రేసు ద్వారాలు మూసుకుపోయాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తొలుత ముంబై ఇండియన్స్ బౌలర్ల దెబ్బకు 97 పరుగులకే కుప్పకూలిన చెన్నై.. ఆ తర్వాత బౌలింగులోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఫలితంగా ముంబై 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.…
గొప్ప బ్యాటింగ్ లైనప్ కలిగిన ఐపీఎల్ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. టాపార్డర్ విఫలమైతే, మిడిలార్డర్ పటిష్టంగా రాణించగలదు. ఐదు వికెట్ల కోల్పోయిన తర్వాత కూడా, చెన్నై జట్టు మంచి స్కోరు సాధించగలదు. అందుకే, ఐపీఎల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా ఈ జట్టు చెలామణి అవుతోంది. అలాంటి చెన్నై, ఈరోజు ముంబై బౌలర్ల చేతిలో కుదేలైంది. కేవలం 97 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, చెన్నై జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే! తొలుత…
ఐపీఎల్‌లో సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓ దశలో 200 స్కోరు చేసేలా కనిపించిన కోల్‌కతా తక్కువ పరుగులు చేసిందంటే దానికి కారణం బుమ్రా. అతడు 4 ఓవర్లు బౌలింగ్ వేసి ఓ మెయిడిన్ సహా 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు.…
ముంబైలోని డా. డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఈ ఐపీఎల్ సీజన్‌లోని 56వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి ముంబై బౌలింగ్ ఎంచుకోగా, కోల్‌కతా బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. తొలుత కోల్‌కాతా టాపార్డర్ సృష్టించిన విధ్వంసం చూసి.. ముంబై ముందు భారీ లక్ష్యం పెడతారని అంతా అనుకున్నారు. గత కొన్ని మ్యాచుల్లో పెద్దగా…
ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఎంత పేలవ ప్రదర్శన కనబర్చిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఐదుసార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన ఈ జట్టు, మునెపెన్నడూ లేనంత దారుణంగా ఈ సీజన్‌లో రాణిస్తోంది. అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్ళందరూ దాదాపు విఫలమయ్యారు.. ఒక్కరు తప్ప! అతడే.. సూర్య కుమార్ యాదవ్. మొదట్నుంచి ముంబై జట్టులో ఇతనొక్కడే బాగా ఆడుతున్నాడు. చాలా కసితో ఆడుతున్న ఇతగాడు, జట్టులోనే అత్యంత కీలకమైన బ్యాట్మ్సన్. అలాంటి సూర్య కుమార్ యాదవ్, ఇప్పుడు ఈ సీజన్…
ఐపీఎల్‌లో శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. అయితే ఓపెనర్లు శుభారంభం అందించినా.. ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసినా ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓడిపోవడంపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఆటగాళ్ల నిర్లక్ష్యమే ఈ ఓటమికి కారణమంటూ ఆరోపిస్తున్నారు. మరొక్క విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాల్సిన గుజరాత్ టైటాన్స్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడం వాళ్ల నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. 178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసింది. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. ముంబై బౌలర్ డానియల్ శామ్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా రాహుల్…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (43), ఇషాన్ కిషన్ (45) రాణించారు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13) విఫలమయ్యాడు. పొలార్డ్ (4) కూడా వెంటనే వెనుతిరిగాడు. కాగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మరోసారి రాణించాడు. తిలక్ వర్మ 16…