ఆహ్లాదం.. విషాదమైంది. ఆనందం.. ఊపిరి తీసింది. ఎంతో ఉల్లాసంగా సాగిపోతున్న ప్రయాణంలో ఒకే ఒక్క కుదుపు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ముంబై తీరంలో బుధవారం జరిగిన బోటు ప్రమాదంలో 13 మంది జలసమాధి అయ్యారు. ఈ దుర్ఘటనతో తీరం దు:ఖ సముద్రం అయింది.
ముంబై తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బోటులో విహరిస్తూ ఆహ్లాదకరంగా గడుపుతున్న పర్యాటకులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓ స్పీడుబోటు అమాంతంగా వచ్చి ఢీకొట్టడంతో ఫెర్రీ బోటు బోల్తా పడింది.