నూతన సంవత్సరం తొలి రోజే ఆ రైతు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. నెల రోజులుగా ఆరబోసిన ధాన్యాన్ని కాంటా వేయడం లేదనీ, అప్పు ఇచ్చిన వ్యక్తుల వద్ద పరువు పోతోందన్న వేదనతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలోని నర్సాపురం బోరు గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన రామటెంకి సందీప్ పండించిన ధాన్యాన్ని నెల రోజుల కిందట గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తరలించి ఆరబోశాడు.…
మేడారం జాతర పనులను వేగవంతం చేయాలని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ర్ట శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గురువారం జాతర ఏర్పాట్లను జంపన్న వాగు వద్ద నిర్మించిన స్నాన ఘట్టాలను, షెడ్లను, ఇతరపనులను అటవీ పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణను రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో కన్నా…
భార్యభర్తలంటే కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా వుండాలంటారు. జీవితాంతం కలిసి వుంటామని బాసలు చేసుకుంటారు. ఒకరికి కష్టం వస్తే మరొకరు అల్లాడిపోతారు. ఒకరు కన్నుమూస్తే.. మరొకరి గుండె కూడా విశ్రాంతి తీసుకుని వారి దగ్గరే వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. సినిమాల్లో మనం ఇలాంటివి చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాం. కానీ గుండెపోటుతో భార్య మృతి చెందిన కాసేపటికే భర్త కన్నుమూసిన ఘటన కన్నీళ్ళు తెప్పించింది. తిరిగి రాని లోకాలకు చేరిన భార్య మృతదేహాన్ని…
కరోనాతో ప్రపంచం అల్లకల్లోలం అయింది. కరోనా తగ్గిందనుకునేలోపే ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. మేడారంకి ముందస్తు మొక్కుల కోసం వస్తున్న వాళ్ళను కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. టీకా వేసుకున్న వారికే వనదేవతల దర్శనానికి అనుమతి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేళ్లకు ఒక్కసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతరకు అప్పుడే జనం తాకిడి పెరిగింది. కరోనా థర్డ్ వేవ్ వస్తుంది అని జరుగుతున్న ప్రచారం నేపథ్యం…
వరంగల్ నగరంలో భ్రూణ హత్యలు నిత్యకృత్యంగా మారాయి. అబార్షన్లను అరికట్టడంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది విఫలం కావడంతో. చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బందికి ఫోన్ చేస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రైవేట్ హాస్పిటల్ తో ఉన్న కనెక్షన్లతో అక్రమ అబార్షన్ పై ఫిర్యాదులు ఉన్న పెద్దగా జిల్లా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జరిగిన సంఘటన నిదర్శనంగా చెబుతున్నారు. ఆడ, మగ తెలిపే లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం…
గత కొన్ని రోజులుగా ఏవోబీ బార్డర్ జరుతున్న ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అంతే కాకుండా హిద్మా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయం భయంగా గడుపు తున్నారు. ఓవైపు పోలీసులు మరో వైపు మావోయిస్టులతో గిరిజన ప్రజలకు దినదిన గండంగా మారుతుంది. తాజాగా పట్ట పగలే మావో యిస్టుల వాల్ పోస్టర్లు కలకలం రేపాయి ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. భీమదేవరకొండ…
ములుగు జిల్లా టేకుల గూడ అడవి ప్రాంతంలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్ అని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులకు ఒక ద్రోహి సమాచారం ఇవ్వడం వలన ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని లేఖలో వివరించారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని జగన్ లేఖలో వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలను చంపడమే కాకుండా తన పాలన గొప్పగా ఉందని తెలపడం కోసం ప్లీనరీని నిర్వహించి, తమ…
అతి ప్రాచీన కట్టడం అయిన రుద్రేశ్వర దేవాలయము అభివృద్ధికి పాటుపడతానన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో అనేక కట్టడాలు ఉన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయాయన్నారు. కేంద్ర పర్యాటక మంత్రిగా బాధ్యత తీసుకున్న తరువాత.. విద్యావతి తన దగ్గరకు వచ్చి మొదటి విషయం చెప్పిన అంశం రామప్ప దేవాలయం గురించే అన్నారు. చాలా దేశాలు రామప్ప దేవాలయం ను వ్యతిరేకించాయని, అయితే దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ దేశాలు అయితే రామప్ప గుర్తింపు కు అడ్డుకున్నాయో వాటి…
నిన్న మొన్నటి వరకు నియోజకవర్గానికే పరిమితమైన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు గేర్ మార్చారట. మొత్తం కోల్ బెల్ట్‌ను చుట్టేసి.. అక్కడ పాగా వేయాలని వ్యూహం రచించారట. అధికారపక్షం బలంగా ఉన్న చోట.. ఆ విపక్ష ఎమ్మెల్యే ఎత్తుగడలు వర్కవుట్ అవుతాయా? ఉత్తర తెలంగాణలో సీతక్క కీలక పాత్ర పోషిస్తారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ములుగు నియోజకవర్గం తప్ప ఇతర ప్రాంతాల్లో పెద్దగా ఫోకస్ పెట్టింది లేదు. గిరిజన తండాల్లో చురుకుగా పర్యటించడానికి ప్రాధాన్యం ఇస్తారామె. కనీసం ఉమ్మడి…