ఈయన ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య. ఈయనేమో అదే జిల్లా జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్. అధికార టీఆర్ఎస్ నాయకుడు. జిల్లా అభివృద్ధిలో కలిసి సాగాల్సిన ఈ ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉంది పరిస్థితి. ముఖ్యంగా కలెక్టర్ తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో రెండు వర్గాల నుంచి పోటాపోటీగా లేఖలు బయటకు వచ్చి దుమారం రేపుతున్నాయి. ఆ మధ్య జిల్లాలో ప్రతిపక్ష నేతలకు ఇచ్చిన విలువ అధికారపార్టీ నేతలమైన…
తెలంగాణలోని ములుగు జిల్లాలో నకిలీ పులి చర్మాన్ని విక్రయిస్తున్న ముఠాను వరంగల్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి నకిలీ పులి చర్మాన్ని 16 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నకిలీ పులి చర్మాన్ని అమ్మే ముఠా వరంగల్ పోలీసులకు చిక్కింది. టైగర్ స్కిన్ కి ఉన్న డిమాండ్ తో మేక తోలును పులి తోలుగా రంగులు వేసి అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్న ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్…
సీతక్క ట్రావెల్స్. సొంత నియోజకవర్గంలో కన్నా మిన్నగా.. మరో సెగ్మెంట్‌లో ఈ పేరు మార్మోగుతోంది. ములుగులోకంటే అక్కడ ఎక్కువగా పర్యటించడం సర్వత్రా చర్చగా మారింది. రకరకాల ఊహాగానాలు షికారు చేసేస్తున్నాయి. ఇంతకీ సీతక్క ఫోకస్ పెట్టిన కొత్త నియోజకవర్గం ఏంటి? పినపాకలో సీతక్క తరచూ పర్యటనలుములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ అలజడి రేపుతున్నారు. ఈ మధ్య పినపాక నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ కొత్త చర్చకు ఆస్కారం కల్పిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ములుగు,…
న్యాయం కోసం అడిగితే అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అధికారులపై మండిపడ్డారు ఎమ్మెల్యే సీతక్క. భద్రాద్రి మణుగూరు బీటీపీఎస్ రైల్వే భూనిర్వాసితులను పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క అధికారుల తీరుని తప్పుబట్టారు. బీటీపీఎస్ రైల్వే భూ నిర్వాసితుల సమస్యపై జేసీ తో ఫోన్ లో మాట్లాడారు ఎమ్మెల్యే సీతక్క. రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న జాయింట్ కలెక్టర్ విధానం పై మండిపడ్డారు సీతక్క. బీటీపీఎస్ రైల్వే భూనిర్వాసితుల సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. భూ నిర్వాసితుల పట్ల పోలీసులు…
శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష సిద్ధాంతి, శ్రీశైల పీఠాధిపతి వీరశైవ పీఠాధిపతి శ్రీ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం పొందారని mulugu.com నిర్వాహకులు కొడుకుల సోమేశ్వర్ రావ్ తెలిపారు. దాదాపు 4 దశాబ్ధాలకు పైగా నిష్పక్షపాతమైన, నిజమైన జ్యోతిష ఫలితాలు, పంచాంగం ద్వారా భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను తన పంచాంగం ద్వారా ప్రజలకు తెలియజేసేవారు. లక్షలాది మందికి మార్గదర్శనం చేయించిన ములుగు సిద్ధాంతి గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. ఎంతోమంది సినీ, రాజకీయ,…
జన సంద్రంతో హోరు ఎత్తే జాతర.. మేడారం సమ్మక్క, సారక్క జాతర ఈ జాతరకు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఈ జాతరకు పేరుంది. జాతరకు ఇంకా సమయం ఉన్న అప్పుడే భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆర్టీసీ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులను నడపడానికి సిద్ధమైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే జాతర కోసం టీఎస్…
ములుగు కర్రిగుట్ట ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ జవాన్‌ను హైదరాబాద్‌కు తరలించారు. ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్‌లో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న జవాన్ మధు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు. గ్రేహౌండ్స్ జవాన్ మధును కలిసేందుకు భారీ స్థాయిలో యశోద ఆస్పత్రికి చేరుకుంటున్న పోలీసు అధికారులు.ఇంటలిజెన్స్, గ్రేహౌండ్స్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకున్నారు. వీరితో పాటు ఐజీ ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ ఛీఫ్ అనిల్ కుమార్ జవాన్‌ణ మధు ఆరోగ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లో…సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ.. ఫుల్ జోష్ మీద ఉన్నారు. అయితే.. గాలిపటం ఎగురు వేస్తున్న నేపథ్యంలో… ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో 12 ఏళ్ల కుర్రాడు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది ఓ గాలిపటం. గాలిపటం ఎగుర వేస్తుండగా… కరెంట్ పోల్ తీగలకు చిక్కింది. విద్యుత్ తీగలకు చిక్కుకున్న గాలిపటాన్ని తీసేందుకు కరెంటు పోల్ ఎక్కాడు ఆ 12 ఏళ్ల బాలుడు.…
ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలోని పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు భారీ గండి పడింది. దీంతో నీరు వృధాగా పోతుంది. ప్రాజెక్టుకు గండి పడి నీరుగా వృధాగా పోతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మత్తులు చేయాలని గతంలో పలుమార్లు అధికారులకు రైతులు విన్నవించినప్పటికీ పట్టించుకోని పరిస్థితి. నాసిరకంగా కెనాల్ నిర్మాణం చేపట్టండం వల్లే గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. Read Also: మళ్లీ తెరపైకి మహిళా యూనివర్సీటీ.. ఓవైపు ప్రకృతి విపత్తులు మరో వైపు…
మేడారంలో సందడి నెలకొంది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం, సంక్రాంతి సెలవులు కావడంతో వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహంచి చీరె, సారె, పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, బెల్లం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల్లోని చెట్ల కింద వంటలు చేసుకుని భోజనాలు…