MLA Seetakka: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారింది. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సమయంలో రాజకీయ నేతల ప్రసంగాలు, విలేకరుల సమావేశాలు ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసామని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేయడానికి ములుగు జిల్లానే స్ఫూర్తి అని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు.
ములుగు జిల్లా బీఆర్ఎస్లో నిరసన సెగలు రగులుతున్నాయి. మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ పార్టీ కార్యకర్తలతో సారంగపల్లిలో భేటీ అయ్యారు. ములుగు నుంచి బరిలో దిగనున్నట్లు ప్రహ్లాద్ తెలుపుతున్నారు. ఇంచార్జ్ జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతికి సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంపై ప్రహ్లాద్ అసంతృప్తి సెగలో ఉన్నారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం మొత్తం వరద నీటితో మునిగిపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఇవాళ (గురువారం) గ్రామ పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క కన్నీరు పెట్టారు. ఇప్పటికీ గ్రామంలో సుమారు వంద మంది ప్రమాదంలో ఉన్నారని, వారిని హెలికాఫ్టర్ ద్వారా రక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె వేడుకున్నారు.
Muthyam Dhara: ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని ముత్యాంధర జలపాతాలను చూసేందుకు వెళ్లిన 160 మంది పర్యాటకులు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు.. 8 గంటలపాటు నీటిలో ఉంటూ కుండపోత వర్షంలో గడిపారు.
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ లను మంజూరు చేయాలంటూ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఆ క్రమంలో బయటకు వచ్చిన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్ వాహనాలను అడ్డుకొని అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలంటూ ఆందోళనకు దిగారు.
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ కుటుంబానికి చివరి వరకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో, రాజకీయాల్లో జగదీష్ మంచి పేరు తెచ్చుకున్నాడని.. కానీ ఆస్తులు సంపాదించుకోలేదని మంత్రి కేటీఆర్ అన్నారు.