కొంతకాలం తన లేఖలకు గ్యాప్ ఇచ్చిన వైసీపీ నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి మరోసారి లెటర్లు రాయడం షురూ చేశారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అందులో ప్రస్తావించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీకు తగునా? అని ప్రశ్నించారు. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోకపోవడం అన్యాయం అని పేర్కొన్నారు.…
Mudragada Padmanabham Meeting with His Followers Today: కొత్త సంవత్సరం వేళ ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన అనుచరులతో సోమవారం సమావేశం ఏర్పాటు చేసారు. ఈ రోజు తన రాజకీయ నిర్ణయంపై అనుచరులకు ముద్రగడ ఓ స్పష్టత ఇవ్వనున్నారు. ప్రస్తుతం ముద్రగడ నివాసానికి అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ముద్రగడ సహా ఆయన ఇద్దరు కుమారులకు అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజకీయాల్లోకి తిరిగి ఎప్పుడు వస్తారు?…
ఏపీలో విచిత్రమయిన రాజకీయం ఏర్పడింది. రాష్ట్రంలోని ప్రధాన కులాలకు పోటీగా మిగతా కులాల నేతలు ఏకీకరణకు ప్రయత్నిస్తున్నారు. నాన్ రెడ్డి, నాన్ కమ్మ నేతల ఏకీకరణ ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో కాపునేతలు సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ఆలోచనకు తెర తీస్తే, దానికి మద్దతు పలికారు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. అయితే ఇవి వైసీపీకి లబ్ధిచేయడానికి చేస్తున్న ప్రయత్నాలుగా మరో కాపు నేత చేగొండి హరిరామజోగయ్య ఆరోపించారు.…
ఏపీలో రాజకీయం మారుతోందా? మూడో రాజకీయశక్తి వైపు అడుగులు పడుతున్నాయా? టీడీపీ, వైసీపీలకు పోటీగా మరో రాజకీయ ప్రత్యామ్నాయం రాబోతోందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. గోదావరి తీరం నుంచి కొత్త రాజకీయ పవనాలు వీస్తున్నాయి. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో రాష్ట్రంలో మూడో రాజకీయశక్తిని తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆదివారం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో బీసీ, ఎస్.సి నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.…