Mpox Clade 1b: దేశంలో అత్యంత ప్రమాదకరమైన ఎంపాక్స్ వైరస్‌కి చెందిన ‘‘క్లాడ్ 1బి’’ వెరైటీని గుర్తించారు. క్లాడ్ 1బీకి సంబంధించి ఇదే మొదటి కేసుగా గుర్తించబడింది.
దేశంలో మంకీపాక్స్ అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. రోగిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చింతించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.
Pakistan : పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఒక విమాన ప్రయాణీకుడికి మంకీ పాక్స్ (ఎంపాక్స్) వైరస్ నిర్ధారణ అయిన తరువాత, దేశంలో 'ఎంపాక్స్' కేసుల సంఖ్య ఐదుకు పెరిగింది
Mpox: ప్రపంచాన్ని ఎంపాక్స్ కలవరపెడుతోంది. ఆఫ్రికా దేశం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వైరస్ విజృంభిస్తోంది. ఆ దేశంలోని అన్ని ప్రావిన్సుల్లో వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 16వేలకు పైగా కేసులు రాగా, వ్యాధి బారినపడి 570 మంది మరణించారు. మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది కొద్ది రోజుల్లోనే 16,000 కేసులు వచ్చాయిని, మరణాల సంకఖ్య 570 కన్నా ఎక్కువగా ఉన్నాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి శామ్యూల్ రోజర్ కంబా…
ఈ నేపథ్యంలో ఎంపాక్స్ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డుల ఏర్పాటుతో పాటు విమానాశ్రయాల్లో అప్రమత్తత ప్రకటించడంతో సహా ప్రభుత్వం అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను తరలించాలని ప్రభుత్వం ఆస్పత్రిని ఆదేశించింది.
Mpox: ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోంది. ఇప్పటికే ఆ దేశంలో ఈ వైరస్ కారణంగా 500కి పైగా మరణాలు, 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే స్వీడన్, పాకిస్తాన్ దేశాల్లో కూడా వ్యాధి నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా హై అలర్ట్‌గా ఉంది.
Mpox – WHO: ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ఎంపాక్స్‌ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందిన తర్వాత ఈ ప్రకటన చేసారు. ఇది పొరుగు దేశాలకు కూడా వ్యాపించింది. Mpox ప్రపంచ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి. అంతకుముందు, ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) Mpox సంక్రమణకు సంబంధించి ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దీంతో…
Mpox: ఆఫ్రికా దేశం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ‘‘ఎంపాక్స్(మంకీ పాక్స్)’’ వ్యాప్తి కలవరపెడుతోంది. ప్రజల మధ్య తేలికగా వ్యాపించే ఈ వ్యాధి అనేక గర్భస్రావాలకు, పిల్లల మరణాలకు కారణమవుతోంది. అయితే, ఈ వ్యాధి ఇప్పటికే ఇరుగుపొరుగు దేశాలకు వ్యాపించే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది ప్రపంచాన్ని కలవరపెట్టిన మంకీపాక్స్ మరోసారి విజృంభిస్తోంది. ఆఫ్రికా దేశం కాంగోలో వ్యాధి విస్తరించడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. కాంగోలో విస్తరిస్తున్న మంకీపాక్స్ స్ట్రెయిన్ శక్తివంతమైందినగా ఉంది. డెమెక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని 26 ప్రావిన్సుల్లో 11 ప్రావిన్సుల్లో మంకీపాక్స్ కేసుల్ని గుర్తించారు. అయితే ఇటీవల కాలంలో కేసుల సంఖ్య పెరగడంతో పాటు 22 ప్రావిన్సులకు వ్యాధి విస్తరించింది. ఆ దేశంలో 12,500 మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. జనవరి-నవంబర్ మధ్యలో 581 మంది…
Monkeypox: కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచాన్ని అంతగా భయపెట్టిన వ్యాధి మంకీపాక్స్. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ వ్యాధి వేల మందికి వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఎమర్జెన్సీ ప్రకటించింది.