Mpox: కాంగోలో ఎంపాక్స్ విధ్వంసం, 570 దాటిన మరణాలు.. వ్యాక్సిన్ కోసం ఎదురుచూపులు..
- కాంగోలో విజృంభిస్తోన్న ఎంపాక్స్..
- 570కి చేరిన మరణాల సంఖ్య..
- ఇతర ఆఫ్రికా దేశాలకు విస్తరిస్తున్న వైరస్..
- వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mpox: ప్రపంచాన్ని ఎంపాక్స్ కలవరపెడుతోంది. ఆఫ్రికా దేశం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వైరస్ విజృంభిస్తోంది. ఆ దేశంలోని అన్ని ప్రావిన్సుల్లో వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 16వేలకు పైగా కేసులు రాగా, వ్యాధి బారినపడి 570 మంది మరణించారు. మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది కొద్ది రోజుల్లోనే 16,000 కేసులు వచ్చాయిని, మరణాల సంకఖ్య 570 కన్నా ఎక్కువగా ఉన్నాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి శామ్యూల్ రోజర్ కంబా తెలిపారు.
Read Also: Earthquake: జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. 4.9 తీవ్రత నమోదు..
Also Read
- Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
ఇప్పటికే ఈ ఎంపాక్స్‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ‘‘గ్లోబల్ పబ్లిక్ హెల్త్‌కేర్ ఎమర్జెన్సీ’’గా ప్రకటించింది. ఈ వ్యాధికి ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. డీఆర్ కాంగోలోనే కాకుండా పక్క దేశాలైన బురుండి, కెన్యా, రువాండా మరియు ఉగాండాలో జూలై నుండి వ్యాధి వ్యాప్తి చెందింది. ఇదిలా ఉంటే యూరప్‌లోని స్వీడన్‌లో తొలి కేసు నమోదైంది. పాకిస్తాన్, ఫిలిప్పీన్స్‌లో కూడా కేసులు బయటపడ్డాయి.
ఆఫ్రికా పేద దేశాల్లో ఈ వ్యాధి విస్తరిస్తుండటంతో ఆయా దేశాలు వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. అమెరికా కాంగో కోసం 50,000 వ్యాక్సిన్ డోసుల్ని పంపుతామని హామీ ఇచ్చింది. జపాన్ 3.5 మిలియన్ డోసులు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. కాంగోలో 3.5 మిలియన్ల పిల్లలతో సహా 4 మిలియన్ల మందికి టీకాలు వేయాలని యోచిస్తోంది. ఎంపాక్స్ దశాబ్ధాలుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం వస్తున్న వైరస్ రకం మరింత ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా ఉందని, క్లాడ్ 1b వైరస్ రకం 3.6 శాతం కేసుల్లో మరణాలకు కారణమవుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
- Tags
- monkeypox
- mpox
- Mpox Virus
- WHO
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!