తెలంగాణ కాంగ్రెస్ కి జవజీవాలు తెచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నియమించింది. దీంతో ఆయన వర్గం ఖుషీగా వుంది. శ్రీరామనవమి సందర్భంగా రామగిరిలో సీతారాముల కల్యాణంలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఏఐసీసీ తనకు ఈ బాధ్యతలు అప్పగించడంతో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. కేసీఆర్…