MP Dhiraj Sahu: "నా డబ్బు కాదు, కానీ"..రూ.350 కోట్లపై తొలిసారి నోరు విప్పిన కాంగ్రెస్ ఎంపీ..ఇటీవల ఆదాయ పన్ను శాఖ(ఐటీ) ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో మద్యం వ్యాపారాలపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు నివాసాల్లో ఏకంగా రూ. 350 కోట్ల నగదు పట్టుబడటంతో దేశం మొత్తం ఒక్కసారిగా నివ్వెరపోయింది. గుట్టలు, గుట్టలుగా పట్టుబడిన నోట్ల కట్టల్ని లెక్కించేందుకు వందలాది మంది అధికారులు, పదుల సంఖ్యలో మిషన్లు అలసిపోయాయి.
PM Modi: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసాల నుంచి ఐటీ అధికారులు భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. గత బుధవారం నుంచి ఆయనకు సంబంధం ఉన్న మద్యం వ్యాపారాలపై దాడులు నిర్వహించారు. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిపిన దాడుల్లో ఏకంగా రూ. 353 కోట్ల నగదు బయటపడటం దేశాన్ని నివ్వెరపరిచింది.