ఇంటి నిర్మాణం కోసం ముగ్గుపోయాలంటే వారికి ముడుపులు చెల్లించాల్సీందే. ముడుపు ముట్టజెప్పకపోతే ముప్పుతిప్పలు తప్పవు మరి. పిల్లర్ల ఎత్తును బట్టి వసూల్ రాజాలు రేటు ఫైనల్ చేస్తారు. అడిగినంత ఇవ్వకపోతే ఆగమాగమే. బీపాస్ లో దరఖాస్తు చేరితే చాలు సంబరాలు చేసుకుంటున్నారట ఆ వసూల్ రాజాలు.. అక్కడ ఇల్లుకట్టుకొవాలంటే మున్సిపాలిటీ అనుమతి కంటే ఆనేతల అనుమతే ముఖ్యంగా మారింది. నల్లగొండ పట్టణంలో ఇంటి నిర్మాణాలకు బీపాస్ లో దరఖాస్తు చేసుకుని నిబంధనల ప్రకారం అనుమతులు ఉంటే సరిపోదు.…