ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా హత్యాచార ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంకోవైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కదులుతున్న కారులో మోడల్‌పై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. సోషల్ మీడియాలో కనెక్ట్ అయిన వ్యక్తి.. సినిమా దర్శకుడిని పరిచయం చేస్తానని నమ్మించి ఆగస్టు 28న లక్నోకు పిలిచి అత్యాచారానికి తెగబడ్డాడు. ఇలా కారు, హోటల్‌లో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి…
మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కదులుతున్న కారులోనే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
గిరిజన వ్యక్తిపై మూత్ర విసర్జన ఘటనను మరువక ముందే మధ్యప్రదేశ్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు.. కదిలే కారులో అతడిని చితకబాది బలవంతంగా అతడితో పాదాలు నాకించి వికృతంగా ప్రవర్తించారు.
రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. త్రిపురకు చెందిన ఒక కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. పశ్చిమ త్రిపుర జిల్లాలో కదులుతున్న కారులో కళాశాల విద్యార్థినిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం విషమ స్థితిలో ఉన్న ఆమెను పశ్చిమ త్రిపురలోని అమాతలి బైపాస్ వద్ద వదలిపెట్టి పరారయ్యారు.