ఏపీలో సినిమా టికెట్ల సమస్య ఇంకా సర్దుమనగడం లేదు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్లైన్ విధానంలో పొందాలని జీవో 142ను జారీ చేసింది. అంతేకాకుండా టికెట్ల ధరలపై కూడా జీవో 35ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 35ను సవాల్ చేస్తూ ఇప్పటికే సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం…
ఏపీ టికెట్ల ధరల తగ్గింపు విషయం చినికిచినికి గాలివానలా తయారైంది. ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు, సినిమా థియేటర్లు మూసివేత పరిణామాలతో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ప్రభుత్వం జీవో 35 ప్రవేశపెట్టి సినిమా టికెట్ల ధరలు అన్ని సినిమాలకు ఒకే విధంగా ఉండేలా నిర్ణయం తీసుకుంది. దీంతో పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టి జీవో 35ను రద్దు…
ప్రజల ప్రయోనాల కోసం సినిమా టికెట్ల ధరలు అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం జీవో 35ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోతో సినిమా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఏపీ హైకోర్టు ఆశ్రయించారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ల పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు ఉందని తెలుపుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 35ను రద్దు చేస్తూ తీర్పనిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం…
సినిమా హాళ్లు బతకడానికి అవకాశం ఇవ్వాలని హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం పై సెటైర్లు వేశారు. టికెట్ రేట్స్ గురించి పలు ట్వీట్లు చేశాడు. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఈ ట్వీట్లు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మీరు ఓ ప్లేట్ ఇడ్లీ లేదా కాఫీ ఎంతకు అమ్మాలో ఏసీ రెస్టారెంట్లకు చెప్పరు. కానీ, సినిమా పరిశ్రమను మాత్రం ఎందుకు సమస్యగా చూస్తారన్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లకు…
ఏపీలో సినిమా టికెట్ ధరలు ఇటీవల కాలంలో టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఇటీవల సవరించిన జీవోతో టాలీవుడ్ లో పెద్ద సినిమాల మనుగడకు పెద్ద ముప్పు ఏర్పడిందన్నది వాస్తవం. ఇలా అయితే ఇండస్ట్రీ మనుగడ కష్టమేనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది దీని వల్ల సినిమాల నిర్మాణ వ్యయం తగ్గి తద్వారా తారలు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు…
ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పేరు ఏపీ రాజకీయాలలో మోత మోగిపోతుంది. ఇదేంటి త్రివిక్రమ్ రాజకీయాలలో ఎప్పుడు చేరాడు.. ఎవరిని ఏమి అన్నాడు అని కంగారు పడకండి. ఆయన ఏమి అనలేదు.. ఒక చిన్న పొరపాటు ఆయనను కూడా ఈ రాజకీయాలలోకి లాగింది. ఇంతకీ విషయం ఏంటంటే.. శుక్రవారం మంత్రి పేర్ని నాని సినిమా టిక్కెట్ల రేట్ల విషయంపై మాట్లాడుతూ త్రివిక్రమ్ చేసిన ట్వీట్ గురించి కూడా జగన్ తో మాట్లాడతానని తెలిపారు. త్రివిక్రమ్ చేసిన ట్వీట్…
సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయం విషయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.. ఈ నేపథ్యంలో పవన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… జనసేనానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఒళ్లంతా బురద చల్లుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. తమ పాలిట గుదిబండ అయ్యారని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ పవన్ కల్యాణ్ గురించి…