ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి భేటి శుక్రవారం జరిగింది. హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అధ్యక్షతన శుక్రవారం జరిగిన వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్న సభ్యులు సినిమా టిక్కెట్ల ధరలు, థియేటర్లలోని మౌలిక వసతులు, ప్రేక్షకుల స్పందనపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. కమిటీలోని సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్న ఛైర్మన్ జనవరి రెండోవారంలో ప్రత్యక్షంగా సభ్యులందరితోనూ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం. సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాలను…