దీపావళి పండగ పర్వదినం రోజు టాలీవుడ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ బాబుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బహుమతులు పంపాడు. ఇందులో పర్యావరణహిత పటాసులతో పాటు స్వీట్లు ఉన్నాయి. పవన్, అన్నా లెజినోవా దంపతులు తమకు గిఫ్టులు పంపిన విషయాన్ని స్వయంగా మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించింది. దీంతో థాంక్యూ అన్నా అండ్ పవన్, హ్యాపీ దివాళి అంటూ నమ్రత కామెంట్…
కమెడియన్‌గా సప్తగిరి పలికే డైలాగులు ఎంతో నవ్వు తెప్పిస్తాయి. అయితే ఇటీవల అతడు ఎక్కువ హీరోగా ఎక్కువ సినిమాల్లో కనిపిస్తున్నాడు. తాజాగా ‘8’ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీపావళి సందర్భంగా ఈ టీజర్‌ను హీరో కళ్యాణ్ రామ్ విడుదల చేశాడు. ఈసారి వెరైటీ కాన్సెప్టును ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళం, తమిళంలోనూ ‘8’ సినిమా రిలీజ్ కానుంది.…
సోషల్ మీడియా పరిధి విస్తృతం కావడంతో పలు సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే పుష్ప, రాధే శ్యామ్, సర్కారు వారి పాట సినిమాలకు సంబంధించి పలు ఫోటోలు, వీడియోలు లీకుల బారిన పడ్డాయి. ఇప్పుడు రాజమౌళి సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’కు కూడా లీకుల బారిన పడిందని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ ఫోటో లీక్ అయింది. ఆ లీకైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ లుక్…
ప్రముఖ హీరోయిన్ త్రిషకు అరుదైన గుర్తింపు లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా లభించింది. ఫలితంగా ఈ వీసా అందుకున్న తొలి తమిళనటిగా త్రిష రికార్డు సాధించింది. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు జారీ చేయడం మొదలుపెట్టింది. ఈ వీసా కలిగినవారు యూఏఈలో సుదీర్ఘకాలం నివాసం ఉండొచ్చు. ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు, సైన్స్, క్రీడలు, తెలివితేటలు వంటి ప్రత్యేక నైపుణ్యం కలిగినవారు, ప్రొఫెషనల్స్ ఈ గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు…
మెగా హీరో సాయిధరమ్‌తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన తర్వాత విడుదలైన సినిమా ‘రిపబ్లిక్’. దీంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్‌లు నిర్వహించారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించలేదు. Read Also: 1000వ ఎపిసోడ్‌కు చేరుకోనున్న జీ తెలుగు సీరియల్ అయితే అక్టోబర్ 1న థియేటర్లలో…
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదల కావాల్సిన ‘రౌద్రం రణం రుధిరం (RRR)’ టీజర్ గ్లింప్స్ వాయిదా పడింది. త్వరలో టీజర్ గ్లింప్స్ విడుదల తేదీపై క్లారిటీ ఇస్తామని RRR యూనిట్ తెలిపింది. ఈ టీజర్ గ్లింప్స్ నిడివి 40 సెకన్ల పాటు ఉంటుందని తెలుస్తోంది. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ త్వరలో విడుదల చేయాలని భావించారు. అందులో భాగంగా…
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తమిళ మూవీ ‘అన్నాత్తె’ తెలుగులో ‘పెద్దన్న’గా రాబోతోంది. ఈ మేరకు బుధవారం చిత్ర యూనిట్ పెద్దన్న మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఈ చిత్రంలో హీరో రజనీకాంత్‌కు చెల్లెలి పాత్రలో మహానటి ఫేం కీర్తి సురేష్ నటించింది. మరోవైపు నయనతార, మీనా, ఖుష్బూ వంటి నటీమణులు కీలక పాత్రలను పోషించారు. Read Also: తమన్నా పరువు అడ్డంగా తీసిన ‘మాస్టర్ చెఫ్’ యాజమాన్యం ‘నువ్వు…
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ మూవీకి ‘కొండా’ అని నామకరణం కూడా చేశాడు. ఈ సినిమా నేపథ్యం వరంగల్ జిల్లా కాబట్టి ఎక్కువ భాగం సినిమా షూటింగ్‌ను వరంగల్, ఆ జిల్లా పరిసర ప్రాంతాల్లో జరపాలని తొలుత నిర్ణయించారు. కానీ ఈ సినిమాపై పలువురు రాద్ధాంతాలు చేస్తున్నందున తాజాగా షూటింగ్ స్పాట్ మార్చినట్లు వర్మ తెలిపాడు. Read Also: ఒకేసారి నాలుగు…
టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. అతడికి యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. విజయ్ నటించిన సినిమాల్లో నాలుగైదు హిట్లే ఉన్నా అతడి నటనకు అభిమానులు ఫిదా అయిపోతుంటారు. ప్రస్తుతం విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి సినిమాల ద్వారా ఆనంద్ మంచి పేరు తెచ్చుకున్నాడు. త్వరలో పుష్పక విమానం సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో తమ్ముడు ఆనంద్ కోసం…
దీపావళి కానుకగా సినీ ప్రేక్షకులకు ఓటీటీ వేదికగా మరో సినిమా అందుబాటులోకి రానుంది. సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ సినిమా ఓటీటీ డేట్స్ ఫిక్సయింది. ఈ మూవీ నవంబర్ 4 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రంలో సందీప్ కిషన్‌కు జోడీగా నేహాశెట్టి నటించింది. కామెడీ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కింది. బాబీ సింహా, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి,…