నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 2న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ కొన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్‌లతో నడుస్తోంది. ఓటీటీలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఓ మూవీ 50 రోజులు పూర్తి చేసుకుందంటే గొప్ప విషయమనే చెప్పాలి. అది కూడా కరోనా వైరస్ బెంబేలెత్తిస్తున్న సమయంలో అఖండ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడం సినీ పరిశ్రమకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. Read Also: టాలీవుడ్‌లో మరో విషాదం..…
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు కానుకగా చిత్ర యూనిట్ ‘పవర్ ఆఫ్ గని’ టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో సునీల్ శెట్టి… వరుణ్‌తేజ్‌కు బాక్సింగ్‌లో కోచింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కొంతమంది యోధులుగా తయారవుతారు… కానీ గని యోధుడిగా పుట్టాడు అని ఈ టీజర్‌కు క్యాప్షన్ ఇచ్చారు. Read Also: క్యాసినో రగడ… ‘జై గుడివాడ’ అంటూ వర్మ…
థమన్, మిక్కీ జె మేయర్ లాంటి స్వరకర్తలు పోటీ ఇస్తున్నా దేవి శ్రీ ప్రసాద్ తన పొజిషన్ ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. దానికి నిదర్శనమే ‘పుష్ప’. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ‘పుష్ప’ విజయంలో దేవిశ్రీకి కూడా భాగం ఉందని చెప్పక తప్పదు. ఈ సినిమాలోని అన్ని పాటలు టాప్ 100 యూట్యూబ్ గ్లోబల్ మ్యూజిక్ వీడియో చార్ట్ లలో చోటు దక్కించుకున్నాయి. దాంతో బాలీవుడ్ బిగ్గీస్ కన్ను ఈ సూపర్ టాలెంటెడ్ కంపోజర్ పై…
సౌతిండియన్ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడాకుల వ్యవహారం గురించిన చర్చ జోరుగా సాగుతుండగానే… జాతీయ మీడియాలో ఇప్పుడు మరో డైవర్స్ ఇష్యూ హల్చల్ చేస్తోంది. ‘మహాభారత్’ టెలివిజన్ సీరియల్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీకృష్ణ పాత్రధారి నితీశ్ భరద్వాజ్ సైతం పన్నెండేళ్ళ తర్వాత తన భార్య స్మిత ఘటె కు విడాకులు ఇస్తున్నాడు. 2019 సెప్టెంబర్ నుండి నితిష్ – స్మిత విడివిడిగా ఉంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్మిత…
రెండు రోజుల క్రితం అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బచ్చన్ పాండే’ మూవీ సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఆ చేదు ఘటన నుండి వెంటనే బయటకు వచ్చిన ఈ చిత్ర బృందం ఇప్పుడీ సినిమాను హోలీ కానుకగా మార్చి 18న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు తెలిపింది. మూవీ హీరో అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని తెలియచేస్తూ, నయా పోస్టర్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. కరోనా కరణంగా…
ఎవరైనా హీరోలు స్టార్స్ అనిపించుకోవాలంటే బిగ్ స్టార్స్ తోనే పోటీ పడాలని ఓ సినిమా ఫార్ములా ఉంది. దానికి అనువుగా ఎంతోమంది సాగి, విజయం సాధించారు. అలా సాగిన వారిలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా ఉన్నారు. వీరు తమ సీనియర్ స్టార్స్ సినిమాలతో పోటీపడుతూ, సంక్రాంతికి తమ చిత్రాలను విడుదల చేసేవారు. అలా జనం నోళ్ళలో నానడానికి అవకాశం సంపాదించారు. తరువాత స్టార్స్ గా వెలిగారు. కృష్ణ వచ్చీ రాగానే హీరోగా సక్సెస్ చూశారు.…
హీరో కృష్ణ, డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి కాంబినేషన్ లో పలు జనరంజకమైన చిత్రాలు తెరకెక్కాయి. వారిద్దరి కలయికలో రూపొందిన పల్లెసీమల నేపథ్యం ఉన్న సినిమాలు విజయాలు సాధించాయి. కృష్ణను సంక్రాంతి హీరోగా నిలిపిన ఘనత కూడా చంద్రశేఖర్ రెడ్డిదే! కృష్ణ హీరోగా పి.సి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘పాడిపంటలు’ చిత్రం విజయం సాధించింది. అప్పటి నుంచీ ప్రతి సంక్రాంతికి కృష్ణ ఓ సినిమాను విడుదల చేస్తూ వచ్చారు. అలా కృష్ణ, పి.సి.రెడ్డి కాంబినేషన్ లో రూపొందిన ‘బంగారుభూమి’ కూడా…
సంక్రాంతి సంబరాల్లో కొత్త సినిమాల సందడే వేరు. పొంగల్ కు కొత్తబట్టలు కట్టుకోవడం ఎంత ఆనందమిస్తుందో, కొత్త చిత్రాలు చూసి మురిసిపోవడంలోనూ అంతే ఆనందం చూస్తుంటారు జనం. దానిని దృష్టిలో పెట్టుకొనే టాప్ హీరోస్ అందరూ సంక్రాంతికి తమ చిత్రాలను జనం ముందు నిలపాలని తపిస్తూ ఉంటారు. 1987లో నాటి స్టార్ హీరోస్ కృష్ణ, శోభన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు తమ చిత్రాలను ఒకే రోజున అంటే జనవరి 14న విడుదల చేయడం విశేషం!…
‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రా శుక్లా కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఉనికి’. రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి దీనిని నిర్మించారు. తొలుత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ సినిమాను దర్శక నిర్మాతలు విడుదల చేయాలని భావించారు. అయితే సంక్రాంతి బరి నుండి పెద్ద చిత్రాలు ‘ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్’ తప్పుకోవడంతో ఆ సీజన్ ను ఉపయోగించుకోవాలనే ఆశతో సినిమా విడుదల తేదీని 15వ తేదీకి…
సంక్రాంతికి కొత్త సినిమాలు సందడి చేస్తాయని తెలుగు ప్రేక్షకులు ఆశించారు. కానీ కరోనా ఆ అవకాశం ఇవ్వలేదు. ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ విడుదల వాయిదా పడింది. ఇక, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ ఇండస్ట్రీకి మరో దెబ్బ. ఇబ్బందనిపిస్తే విడుదల వాయిదా వేసుకోవచ్చని మంత్రి గారే స్వయంగా సెలవిచ్చారు. టికెట్ల ధరలపై దర్శకుడు ఆర్జీవీతో సమావేశం తరువాత మంత్రి పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, టికెట్ల ధరల వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన కమిటీ…