Natu Natu Song:ఈ సారి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ 'ట్రిపుల్ ఆర్'లో కీరవాణి బాణీలకు చంద్రబోస్ రాసిన "నాటు నాటు..." పాటకు 'ఒరిజినల్ సాంగ్' విభాగంలో ఆస్కార్ రావడం ఖాయమని తెలుస్తోంది. మార్చి 12న ఆదివారం సాయంత్రం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెలిస్ లో జరగనుంది.
నేడు మెగాస్టార్ గా జనం మదిలో నిలచిన చిరంజీవి తన తరం హీరోల్లో నవలానాయకునిగానూ జేజేలు అందుకున్నారు. అంతకు ముందు తెలుగునాట నవలానాయకునిగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జైత్రయాత్ర చేశారు. ఆయన తరువాత తెలుగు చిత్రసీమలో ఆ క్రెడిట్ చిరంజీవికే దక్కుతుందని చెప్పవచ్చు.
Talli Prema : నటరత్న యన్.టి.రామారావు, నటిశిరోమణి సావిత్రి జంటగా అనేక చిత్రాలు తెలుగువారిని అలరించాయి. వారిద్దరూ సెంటిమెంట్ భలేగా పండించగా రూపొందిన 'తల్లిప్రేమ' సైతం ప్రేక్షకులను రంజింప చేసింది.
దక్షిణాదిన విజయవంతమైన చిత్రాల కథలతో హిందీ సినిమాలు రూపొంది అలరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యాభై ఐదేళ్ళ క్రితం హిందీలో 'దో కలియా' అదే తీరున సందడి చేసింది.
Spielberg - Tom Cruise: చిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ శాశ్వత శత్రువులు కానీ, శాశ్వత మిత్రులు కానీ ఉండరని అంటారు. హాలీవుడ్ టాప్ స్టార్ టామ్ క్రూయిజ్, ఆస్కార్ అవార్డు విజేత స్టీవెన్ స్పీల్ బెర్గ్ అదే విషయాన్ని మరోమారు నిరూపించారు. స్పీల్ బెర్గ్ దర్శకత్వంలో టామ్ క్రూయిజ్ తొలిసారి నటించిన చిత్రం 'మైనారిటీ రిపోర్ట్', మంచి విజయం సాధించింది.
పిన్నవయసులోనే కన్నుమూసిన హీరో తారకరత్న గురించి, ఇప్పుడు నందమూరి అభిమానులు విశేషంగా చర్చించుకుంటున్నారు. నిజానికి తారకరత్న కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ లేకపోయినప్పటికీ, నందమూరి ఫ్యాన్స్ కు ఆయనంటే అంత అభిమానం!