Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణమైన సంఘటన జరిగింది. సభ్య సమాజం తలదించుకునే పని చేసింది ఓ తల్లి. కొడుకు అని చూడకుండా ప్రియుడి కోసం హత్యకు పాల్పడింది కసాయి తల్లి. అక్రమ సంబంధం, కామం, డబ్బు కోసం కన్న కొడుకునే హతమార్చింది. కాన్పూర్ దేహాత్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికుల్ని నివ్వెరపరించింది.
భూ వివాదంలో కన్న కొడుకు ప్రాణాలనే తీసింది ఓ తల్లి.. తరచూ పొలం విషయంలో గొడవ జరగడం.. తాజాగా మరోసారి కూడా అదే ఘర్షణ జరగడంతో.. కొడుకునే తల్లి దారుణంగా హత్య చేసిందని మృతుడి భార్య ఆరోపిస్తోంది.
Mother Kills 25-Year-Old Son for Opposing Illicit Affair: మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని 25 ఏళ్ళ కన్న కొడుకుని తల్లి చంపేసింది. హత్యకు ప్రియుడు సైతం సహకరించారు. 9 నెలల తర్వాత అహ్మద్ పాషా (25) హత్య కేసును పోలీసులు ఛేదించారు. తూప్రాన్ (మం) వెంకటాయపల్లిలో ఘటన చోటు చేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం న్యూ గొల్లగూడెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తుకు బానిసై డబ్బులు ఇవ్వమని వేధిస్తున్న కొడుకును, తల్లే హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది. కొడుకు రాజ్ కుమార్ వేధింపులు తట్టుకోలేక తల్లి దూడమ్మ సంచలన నిర్ణయం తీసుకుంది. కొడుకును కాళ్లు కట్టేసి, కొట్టి ఉరివేసి హత్య చేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి ఆధ్వర్యంలో విచారణ…
బిడ్డలను కడుపులోపెట్టుకొని చూసే తల్లులను చూసే ఉంటాం. బిడ్డల భవిష్యత్తు కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టిన తల్లులు గురించి వినే ఉంటాం. కానీ, ఇక్కడ ఒక తల్లి మూఢనమ్మకాలకు పోయి కడుపున పుట్టిన కొడుకును కిరాతకంగా కడతేర్చింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే మైసూరు జిల్లా హెచ్.డి.కోటె తాలూకాలోని బూదనూరు గ్రామంలో భవాని అనే మహిళ భర్తతో కలిసి నివసిస్తోంది. వీరికి శ్రీనివాస్ అనే నాలుగేళ్ళ కుమారుడు ఉన్నాడు. అయితే…