కర్ణాటకలోని ఓ మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరమా అని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరపూరిత చర్య ఎలా అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో పాటు మసీదులో నినాదాలు చేసిన నిందితులను ఎలా గుర్తించారని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ సందీప్ మెహతా డివిజన్ బెంచ్…
ఉత్తరప్రదేశ్‌లోని బండాలోని ప్రసిద్ధ బంబేశ్వర్ పర్వతం సమీపంలో నిర్మించిన ఆలయం, మసీదు అంశం ఊపందుకుంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి), భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Demolition Mosque: ముంబై నగరంలోని ధారావిలో అక్రమంగా నిర్మించిన మసీదు కూల్చివేతకు నేటి (సోమవారం)తో గడువు అయిపోయింది. దీంతో మసీదు కమిటీనే స్వయంగా తమ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేతలు కొనసాగిస్తుంది.
వరుస బాంబు పేలుళ్లతో మరోసారి ఆఫ్ఘనిస్థాన్ ఉలిక్కిపడింది… ఏకంగా ఐదు బాంబులు పేలడంలో అంతా ఆందోళనకు గురయ్యారు.. కాబూల్ సహా ఐదు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి.. ఈ పేలుళ్లలో మొత్తం 20 మందికి పైగా మృతిచెందారు.. ఇక, ప్రార్థనా మందిరంలో జరిగిన భారీ పేలుడులో 65 మంది గాయాలపాలయ్యారు. వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆఫ్ఘన్‌లోని మజార్-ఎ-షరీఫ్‌లోని మసీదులో జరిగిన పేలుడులో 5 మంది మృతి చెందగా, 50 మందికి గాయాలు అయ్యాయి..…
పాకిస్థాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది.. పాకిస్థాన్‌లోని ఓ మసీదులో జరిగిన బాంబు పేలుడు ఏకంగా 30 మందికి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు.. వాయువ్య పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలో కోచా రిసల్దార్ ప్రాంతంలో జరిగిన పేలుడులో కనీసం 30 మంది మరణించారని.. వంద మందికి పైగా గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు.. పెషావర్‌లో శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఈ పేలుడు సంభవించింది.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.. మేం…
ఏపీ సర్కార్ తీరుపై ఈమధ్యకాలంలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. హిందువుల భూములను ఆక్రమించుకుని మసీదులు కట్టాలని ఎస్డీపీఐ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎస్డీపీఐ రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ అహ్మదుల్లా అవాకులు చవాకులు పేలుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల ఓట్ల కోసం కక్కుర్తి పడుతుందన్నారు. ఏపీని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష సీఎంకు లేదు. సంపూర్ణ మద్య నిషేధం అన్న జగన్ మద్యం తాగటానికి మరో గంట పొడిగించాడు. ఈ ప్రభుత్వంలో బ్రాందీలు వాళ్లకు…
ఆఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వశం అయిన తర్వాత కూడా పేలుళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. మొన్నటి మొన్న మసీదులో ఆత్మాహుతి దాడిలో భారీ ప్రాణనష్టం జరగగా.. ఇవాళ కాందహార్‌లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుళ్లు జరిగాయి.. ఈ ఘటనలో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు.. కాందహార్‌లో నడిబొడ్డున్న ఉన్న మసీదులో ఈ పేలుడు సంభవించింది.. షియా వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈ పేలుడు జరిగింది.. 16…