నైరుతి రుతుపవనాల రాకతో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. కేరళ తర్వాత, నైరుతి రుతుపవనాలు సమయానికి ముందే మహారాష్ట్రకు చేరుకున్నాయి. ఆదివారం మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా, పూణే-సోలాపూర్ హైవే జలమయం అయింది. రోడ్లు నదులను తలపించాయి. రోడ్లపై నీరు ఉదృతంగా ప్రవహించడంతో కార్లు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: భారీ వర్షాలు ప్రజల్లో భయానక…
అమరావతి : నేడు చెన్నై లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన. ఇప్పటికే చెన్నై చేరుకున్న పవన్. ఉదయం 10 గంటలకు తిరువాన్మియూరు రామచంద్ర కన్వెన్షన్ హాలులో ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’పై సదస్సు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న పవన్ కళ్యాణ్. అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయానికి రానున్న సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పథకాల అమలు…సర్వే రిపోర్ట్ పై సమీక్ష. సాయంత్రం ఆరు గంటలకు సచివాలయం నుంచి నేరుగా కడప…
ఈ ఏడాది వేసవి కాలంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయి. దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. కానీ ఈ ఏడాది భిన్నమైన వాతావరణం నెలకొంది. పెద్దగా ఎండల ప్రభావం కనిపించకుండానే వేసవి ముగుస్తోంది.
కేంద్ర వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది ఐదు రోజులు ముందుగానే.. అనగా మే 25న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు ఐఎండీ తెలిపింది.
Weather Report : దక్షిణ భారతదేశంలో వాతావరణం కీలక మార్పులకు లోనవుతోంది. సాధారణంగా రుతుపవనాల రాకకు సూచికగా, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మరో రెండు, మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఇది శుభవార్తే అయినా, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ వాయుగుండం పశ్చిమ తీరం వెంబడి విస్తృత వర్షపాతానికి దారితీసే అవకాశం ఉంది. కేవలం అరేబియా సముద్రంలోనే కాకుండా, ఈ నెల…
Rain Alert : నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముండగా, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో ముడిపడి, ద్రోణి మధ్య కోస్తా ఆంధ్ర తీరం వరకు ఏర్పడిందని తెలిపింది. ఇది సముద్రమట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వివరించింది.…
GHMC: మాన్సూన్ ముందస్తు ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వి కర్ణన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచనలు జారీ చేశారు.
Southwest Monsoon: దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
IMD : భారత వాతావరణ శాఖ (IMD) తాజా ప్రకటన ప్రకారం, దేశాన్ని ప్రభావితం చేసిన ఎల్ నినో పరిస్థితులు తొలిగిపోయాయి. దీని ప్రభావంతో గత ఏడాది పాటు ప్రతీ సీజన్ ఆలస్యంగా మొదలైందీ కాక, సాధారణ దినాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, ఇప్పుడు ఈ వాతావరణ తారతమ్యం తగ్గిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని ఈశాన్య భాగంలో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఎక్కువగా పెరిగే ఒక ప్రకృతి…