భారతదేశం వ్యవసాయాధారిత దేశం. ఎక్కువమంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. పంటలు సమృద్ధిగా పండాలంటే వర్షాలే ఆధారం. సమయానికి వర్షాలు కురిస్తేనే అన్నదాత కళ్లల్లో ఆనందం నిండుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రైతన్నలకు గుడ్ న్యూస్ అందించింది. మాన్‌సూన్ అప్‌డేట్ అందించింది. ఈ సంవత్సరం జోరుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. IMD అంచనా ప్రకారం.. ఈసారి రుతుపవనాలు సగటు కంటే 105 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు చేస్తాయని అంచనా వేసింది. లడఖ్, ఈశాన్య, తమిళనాడులలో…
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్‌ని భారీ వర్షాలు, మెరుపు వరదలు కలవరపెడుతున్నాయి. రుతుపవన వర్షాల కారణంగా సంభవిస్తున్న వరదలు దక్షిణ పాకిస్తాన్‌ని ముంచెత్తుతున్నాయి. జూలై 1 నుంచి వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 209కి పెరిగింది. పంజాబ్ ప్రావిన్స్‌లో గడిచిన 24 గంటల్లో 14 మంది మరణించారని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారి ఇర్ఫాన్ అలీ తెలిపారు.
వర్షాకాలంలో అనేక సమస్యలు వస్తుంటాయి. తరచూ కురుస్తున్న వర్షాల వల్ల చాలా మంది జలుబు మరియు దగ్గుతో ఇబ్బంది పడుతుంటారు. చాలా సార్లు ఆఫీసుకు వెళ్లే సమయంలో వర్షం కురుస్తుంది.
Bihar Bridge Collapse: బీహార్ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా వరుసగా బ్రిడ్జ్‌లు కూప్పకూలిపోతున్నాయి. కేవలం 17 రోజుల వ్యవధిలోనే దాదాపు 12 వంతెనలు కూలిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ఇచ్చిన వివరణ నివ్వెరపరుస్తోంది.
UP Rains : ఉత్తరప్రదేశ్‌లో రుతుపవనాలు ప్రవేశించిన తరువాత ప్రజలకు తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం లభించింది. గత 24 గంటల్లో లక్నో, బారాబంకి, ఝాన్సీ, బస్తీ, సంత్ కబీర్, ఫిరోజాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా హరిద్వార్‌లోని ఖర్ఖారీ నదిలో ఆగి ఉన్న వాహనాలు గంగా నదిలో కొట్టుకుపోయాయి. అదే సమయంలో.. ఉత్తర హరిద్వార్‌లో ప్రజల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది.
Weather Update: తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించాయి. దీంతో నేడు, రేపు (గురు, శుక్ర)వారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
అనుకున్న సమయానికి ముందే మే 30న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు... క్రమంగా ముందుకు కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో కేరళవ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, అక్కడ నుంచి కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి.