ఇంటి నిర్మాణం కోసం ముగ్గుపోయాలంటే వారికి ముడుపులు చెల్లించాల్సీందే. ముడుపు ముట్టజెప్పకపోతే ముప్పుతిప్పలు తప్పవు మరి. పిల్లర్ల ఎత్తును బట్టి వసూల్ రాజాలు రేటు ఫైనల్ చేస్తారు. అడిగినంత ఇవ్వకపోతే ఆగమాగమే. బీపాస్ లో దరఖాస్తు చేరితే చాలు సంబరాలు చేసుకుంటున్నారట ఆ వసూల్ రాజాలు.. అక్కడ ఇల్లుకట్టుకొవాలంటే మున్సిపాలిటీ అనుమతి కంటే ఆనేతల అనుమతే ముఖ్యంగా మారింది. నల్లగొండ పట్టణంలో ఇంటి నిర్మాణాలకు బీపాస్ లో దరఖాస్తు చేసుకుని నిబంధనల ప్రకారం అనుమతులు ఉంటే సరిపోదు.…
ఏపీలో మహిళలపట్ల దారుణాలు ఆగడం లేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళల్ని, బాలికల్ని టార్గెట్ చేస్తున్నారు కొందరు మృగాళ్ళు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి అత్యాచార ఘటన మరువక ముందే మరో బాలికపై అత్యాచార ప్రయత్నం జరిగింది. నూజివీడుకు చెందిన మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇంటికి తీసుకుని వెళ్తా అని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళాడు ఆటో డ్రైవర్. 5వేలు డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బులు ఇవ్వు లేదంటే నైట్ మొత్తం నాతో గడువు అంటూ…
మత్తెక్కించే చాట్ లు,,రెచ్చగొట్టే మగువల ఫోటోలు.. కాస్త ముగ్గులోకి దిగితే చాలు అంతే జేబుగుల్ల కావడం ఖాయం. ఇన్నాళ్ల పాటు పట్టణ ప్రాంతాలకు పరిమితం అయిన యవ్వారం ఇప్పుడు ఏకంగా ఏజెన్సీ ప్రాంతాల్లోకి పాకింది. సోషల్ మీడియా వేదికగా వలపు వలేసి…వయ్యారి భామల ఫోటోలతో పైసా వసూల్ చేస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఏజెన్సీలో పెరుగుతున్న సైబర్ ఆగడాలు యువతను చిత్తుచేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా సైబర్ పంజా విసురుతున్నారు కేటుగాళ్లు. మరీ ముఖ్యంగా ఈమధ్య కాలంలో…