హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐఎస్ సదన్ పోలీసు స్టేషన్ పరిధి మాదన్నపేట చౌరస్తాలోని ఓ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు నల్లటి పొగ ఆ ప్రాంతమంతా దట్టంగా వ్యాపించింది. మంటలను చూసి పరిశ్రమలోని కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదంను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని.. 6 ఫైరింజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సోఫా మరియు తలుపులను…