Mohammed Siraj Hugs Jasprit Bumrah after 5 Wicket Haul in MI vs RCB: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం వాంఖడేలో మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. సహచర, ప్రత్యర్థి బౌలర్లు తేలిపోయిన వాంఖడే పిచ్‌పై బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక్కో బౌలర్ 40, 50 పరుగులు సమర్పించుకుంటే.. బుమ్రా మాత్రం తన నాలుగు ఓవర్ల కోటాలో 21 రన్స్…
Mohammed Siraj photo with Orry Shakes Internet: ఇటీవలి రోజుల్లో బాలీవుడ్ సెలెబ్రిటీలతో ఓ వ్యక్తి ఎక్కువగా కనిపిస్తున్నాడు. స్టార్ హీరో, హీరోయిన్‌లను పట్టుకుని ఫొటోలకు పోజులిస్తున్నాడు. అతడితో ఫొటోలు దిగేందుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అతడే ‘ఓర్హాన్ అవత్రమణి అకా ఓరీ’. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓరీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా సంచలనం ఓరీ షేర్ చేసిన ఫొటోస్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఆ ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం…
Parthiv Patel react on Mohammed Siraj’s Bowling in Uppal Test: మహమ్మద్ సిరాజ్‌తో ఎక్కువగా బౌలింగ్ చేయించనప్పుడు అతన్ని తుది జట్టులో ఆడించడం ఎందుకు? అని, ఏడు ఓవర్ల కోసం స్పెషలిస్ట్ పేసర్ అవసరమా? అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ పార్థివ్ పటేల్ ప్రశ్నించాడు. సిరాజ్‌కు బదులు ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలన్నాడు. అక్షర్ పటేల్‌కు బదులు కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.…
పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ట్రాన్స్‌లేటర్‌గా మారాడు. సిరాజ్ హిందీలో మాట్లాడితే.. బుమ్రా ఆ వ్యాఖ్యలను ఆంగ్లంలోకి అనువదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విషయం సాధించింది. ఈ విజయంలో బుమ్రా, సిరాజ్ కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 6 వికెట్స్ తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 6…
ఇప్పటి వరకు ఏ ఆసియా జట్టు చేయలేని పనిని భారత జట్టు చేసింది. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కడంతో పాటు రోహిత్ శర్మ తొలి కెప్టెన్‌గా కూడా నిలిచాడు. దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌట్ చేసింది.
Mohammed Siraj on Bowled two innings on the same day: ఒకే రోజు రెండు ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేస్తామని తాను అస్సలు అనుకోలేదని టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో సాధ్యం కాని దాన్ని ఈసారి చేసి చేసి చుపించా అని తెలిపాడు. ఒకే విధమైన బంతులు నిలకడగా వేసి ఫలితం సాధించానని సిరాజ్ పేర్కొన్నాడు. సెంచూరియన్ మాదిరిగానే కేప్ టౌన్ కూడా పేస్‌కు అనుకూలంగా ఉందన్నాడు. రెండో టెస్టులో…
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. 55 పరుగులతో దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేశారు. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి సెషన్లోనే ఆలౌట్ కావడం గమనార్హం. సెంచూరియన్‌లో లొంగిపోయిన భారత జట్టు కేప్‌టౌన్ టెస్టులో అద్భుతంగా పునరాగమనం చేసింది.
Mohammed Siraj Injury Scare For Team India: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకెళుతున్న టీమిండియాకు కీలక సెమీఫైనల్‌కు ముందు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ మొహ్మద్ సిరాజ్కు గాయం అయింది. నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సిరాజ్ గాయపడ్డాడు. క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించగా.. బంతి నేరుగా సిరాజ్ గొంతుపై పడింది. ఇదే ఇప్పుడు భారత అభిమానులను భయాందోళనకు గురిచేస్తోంది. భారత్-న్యూజీలాండ్ సెమీఫైనల్లో సిరాజ్ ఆడుతాడా? లేదా? అని చర్చిస్తున్నారు.…
వన్డే ప్రపంచకప్-2023లో భారత జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. అ మెగా టోర్నమెంట్ లో భాగంగా నేడు వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో 5 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన షమీ.. కేవలం 18 పరుగుల మాత్రమే ఇచ్చి కీలకమైన 5 వికెట్లు పడగొట్టాడు.
2023 ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటి వరకు వరుసగా 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బ్యాట్స్‌మెన్, బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. కానీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రం ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆసియా కప్‌లో విజృంభించిన సిరాజ్.. వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు ఫామ్‌లో లేకపోవడం టీమిండియాకు ఇబ్బందిని కలిగిస్తోంది.