Mohammed Siraj on Bowled two innings on the same day: ఒకే రోజు రెండు ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేస్తామని తాను అస్సలు అనుకోలేదని టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో సాధ్యం కాని దాన్ని ఈసారి చేసి చేసి చుపించా అని తెలిపాడు. ఒకే విధమైన బంతులు నిలకడగా వేసి ఫలితం సాధించానని సిరాజ్ పేర్కొన్నాడు. సెంచూరియన్ మాదిరిగానే కేప్ టౌన్ కూడా పేస్‌కు అనుకూలంగా ఉందన్నాడు. రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌటైంది. సఫారీ జట్టు పతనాన్ని సిరాజ్ శాసించాడు. 9 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి.. ఆరు వికెట్స్ పడగొట్టాడు. తొలి టెస్టులో 91 పరుగులు ఇచ్చి.. రెండు వికెట్లను మాత్రమే తీశాడు.
రెండో టెస్ట్ మొదటి రోజు మ్యాచ్ ముగిసిన అనంతరం మహమ్మద్ సిరాజ్ మీడియాతో మాట్లాడాడు. ఒకే రోజు రెండు ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేస్తావని ఎప్పుడైనా ఊహించావా? అని అడగ్గా… నిజంగా ఒకే రోజు రెండు ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేస్తామని అనుకోలేదు అని సమాధానం ఇచ్చాడు. ‘ఈ మ్యాచ్‌లో భారత్ ఒకడుగు ముందే ఉంది. క్రికెట్‌లో సానుకూల, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. తొలి ఇన్నింగ్స్‌లో నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించాలనుకుంటున్నా. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో నేను ఏం చేయలేకపోయానో.. రెండో టెస్టులో అది చేసి చూపించా. ఒకే విధమైన బంతులు నిలకడగా వేసి.. ఫలితం సాధించా. సెంచూరియన్ మాదిరిగానే కేప్ టౌన్ కూడా పేస్‌కు అనుకూలంగా ఉంది’ అని సిరాజ్ చెప్పాడు.
Also Read: Hanuman Pre Release Event: ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి?
‘ఈ టెస్ట్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రాతో కలిసి కొన్ని మెయిడిన్లు వేశాం. దీంతో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. ఇలాంటి పిచ్‌పై లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే వికెట్లు దక్కుతాయని స్పష్టం అయింది. వైవిధ్యం కోసం ప్రయత్నిస్తే.. అయోమయానికి గురికావాల్సి ఉంటుంది. సీనియర్ బౌలర్, వికెట్ కీపర్ ఇచ్చే సూచనలు చాలా కీలకం. తరచూ వారితో చర్చిస్తే మన పని సులువుతుంది. మన బౌలింగ్‌లో 4-5 బౌండరీలు కొట్టినా వికెట్ కోసం ఏ లెంగ్త్‌లో బంతిని వేయాలనేది కూడా తెలుస్తుంది. రెండో రోజు ఏం జరుగుతుందో చెప్పలేను. ప్రస్తుతానికి మా జట్టు ఇంకా 36 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. దక్షిణాఫ్రికాను సాధ్యమైనంత త్వరగా ఆలౌట్ చేసి.. లీడ్ సాధించకుండా చూస్తాం’ అని మహమ్మద్ సిరాజ్ తెలిపాడు.