Mohammed Siraj Said I thought I might not be able to play today: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హ్యాట్రిక్ విజయం సాధించింది. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. గుజరాత్‌ను బెంగళూరు ఓడించడంలో మొహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. తన కోటా నాలుగు ఓవర్ల రెండు వికెట్లు తీసి.. 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ సీజన్‌లో సిరాజ్‌కు ఇదే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ కావడం విశేషం. గత కొన్ని మ్యాచుల్లో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన సిరాజ్.. గుజరాత్‌పై బరిలోకి దిగి సత్తాచాటాడు.
Also Read: Parthiv Patel: గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై కామెంట్స్.. పార్థివ్ పటేల్‌ను టార్గెట్ చేసిన ఫాన్స్!
అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న మొహమ్మద్ సిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న అనంతరం సిరాజ్ మాట్లాడుతూ… ‘కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ఆడతానని అస్సలు అనుకోలేదు. ఎలాగైనా మైదానంలోకి దిగాలని కోరుకున్నా. చాలా శ్రమించా. చివరకు మంచి ఫలితం అందుకోవడం ఆనందంగా ఉంది. ఐపీఎల్‌లో ప్రతి బంతిని వేయడానికి 110 శాతం కష్టపడాలి. బాగా రాణించేందుకు ప్రయత్నిస్తా. బెంగళూరు విజయం సాధించడం బాగుంది. మిగతా మ్యాచుల్లోనూ ఇదే ప్రదర్శన చేస్తాం’ అని చెప్పాడు.