MI vs RCB: నువ్ తోపు అన్న.. జస్ప్రీత్ బుమ్రాకు శిరస్సు వంచి సలాం కొట్టిన మహమ్మద్ సిరాజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Siraj Hugs Jasprit Bumrah after 5 Wicket Haul in MI vs RCB: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం వాంఖడేలో మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. సహచర, ప్రత్యర్థి బౌలర్లు తేలిపోయిన వాంఖడే పిచ్‌పై బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక్కో బౌలర్ 40, 50 పరుగులు సమర్పించుకుంటే.. బుమ్రా మాత్రం తన నాలుగు ఓవర్ల కోటాలో 21 రన్స్ ఇచ్చి ఏకంగా 5 వికెట్స్ పడగొట్టాడు. బుమ్రా బౌలింగ్‌కు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యరు. సోషల్ మీడియాలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్, టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ మంత్ర ముగ్దుడయ్యాడు. నువ్ తోపు అన్న అన్నట్లుగా బుమ్రాకు శిరస్సు వంచి సలాం కొట్టాడు. మ్యాచ్ అనంతరం బుమ్రా మైదానంలోకి రాగా.. సిరాజ్ దగ్గరకు వచ్చి శిరస్సు వంచి సలాం కొట్టాడు. ఆపై ఇద్దరు కౌగిలించుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Jasprit Bumrah: కెనడా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకున్నా: జస్ప్రీత్ బుమ్రా
ఈ మ్యాచ్‌లో బెంగళూరు పై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. డుప్లెసిస్ (61), రజత్ పాటిదార్ (50), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేశారు. బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్ కిషన్ (69), సూర్యకుమార్ యాదవ్ (52) విధ్వంసం సృష్టించారు.
A @Jaspritbumrah93 special with the ball backed 🆙 by a power packed batting performance help @mipaltan win ✌ in ✌ 💙
Scorecard ▶️ https://t.co/Xzvt86cbvi#TATAIPL | #MIvRCB pic.twitter.com/ro7TeupAQj
— IndianPremierLeague (@IPL) April 11, 2024
తాజావార్తలు
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!