PM Modi: 2002 సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై దాడి, గుజరాత్ అల్లర్ల గురించి ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడారు. గోద్రాలో 2002 సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన దాడి "ఊహించలేని స్థాయిలో జరిగిన విషాదం" అని ఆయన అన్నారు. దీని తర్వాత జరిగిన అల్లర్లు ‘‘ప్రతీ ఒక్కరికి విషాదకరమైనవి’’గా చెప్పారు. 2002 తర్వాత 22 ఏళ్లలో గుజరాత్‌లో ఒక్క అల్లరి కూడా జరగలేదని చెప్పారు.